సమస్యలు తీరేనా! | - | Sakshi
Sakshi News home page

సమస్యలు తీరేనా!

Aug 8 2026 1:11 AM | Updated on Aug 8 2026 1:11 AM

● రెండేళ్ల తర్వాత మండల సభలు ● అభివృద్ధి పనులు.. సమస్యలపై సమీక్ష ● 19 శాఖల అంశాలపై చర్చ

● రెండేళ్ల తర్వాత మండల సభలు ● అభివృద్ధి పనులు.. సమస్యలపై సమీక్ష ● 19 శాఖల అంశాలపై చర్చ

బోయినపల్లి(చొప్పదండి): పంచాయితీరాజ్‌ వ్యవస్థను బలోపేతం చేసేందుకు ఉపయోగపడే మండల పరిషత్‌ సర్వసభ్య సమావేశాలు రెండేళ్ల తర్వాత ఇటీవల జరిగాయి. 2025 డిసెంబర్‌లో ఎన్నికై న సర్పంచులకు ఏడు నెలల తర్వాత తమ గ్రామాల్లోని సమస్యలు చెప్పుకునేందుకు అవకాశం లభించింది. గత జూలైలో జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాల్లో సభలు నిర్వహించారు. సర్పంచులు సభ దృష్టికి తీసుకొచ్చిన సమస్యలను అధికారులు నోట్‌ చేసుకున్నారు. ఏళ్లుగా పేరుకుపోయిన సమస్యలకు పరిష్కారం లభిస్తుందనే ఆశలో సర్పంచులు ఉన్నారు.

19 అంశాలపై చర్చ

మండల సమావేశాల్లో వ్యవసాయం, ఉద్యానశాఖ, విద్య, వైద్యం, డీఆర్డీవో, గ్రామీణ మంచినీటి పథకం, శిశుసంక్షేమం, పీఆర్‌ ఇంజినీర్‌, విద్యుత్‌, ఐకేపీ, పౌరసరఫరాలు, వీబీ–జీ రామ్‌జీ పథకం, పశుపోషణ, వైద్య ఆరోగ్యం, ఐసీడీఎస్‌, హౌసింగ్‌, నీటిపారుదల, ఎకై ్సజ్‌, అటవీ, ఆర్‌అండ్‌బీ శాఖలకు చెందిన 19 అంశాలపై చర్చించారు. మూడు నెలల ప్రగతి నివేదికలను అధికారులు చదివి వినిపించారు. సమావేశాలకు అటవీ, మైనింగ్‌, విద్యుత్‌, ఎస్సీ, బీసీ కార్పొరేషన్‌ తదితర డివిజన్‌ శాఖల అధికారులు హాజరుకాలేదు.

సమస్యలు తీరేనా ?

కొత్తగా ఎన్నికై న సర్పంచులు ఏడు నెలల తర్వాత అధికారికంగా మండల స్థాయి సమావేశాలకు హాజరయ్యారు. గ్రామాల్లోని సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. రోడ్ల మరమ్మతులు, తాగునీటి సమస్య, ఇందిరమ్మ ఇళ్లకు ఇసుక, మొరం కావాలని అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. పలు గ్రామాల్లో కోతులు, కుక్కల బెడద తీవ్రంగా ఉందని తెలిపారు. సర్పంచులు లేవనెత్తిన అంశాలను అధికారులు మినిట్స్‌లో పొందుపరచారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement