సిరిసిల్ల: ప్రైవేటు ఆస్పత్రులు ప్రభుత్వ నిబంధనలు పాటించాలని జిల్లా వైద్యాధికారి ఏంజెలా ఆల్ఫ్రెడ్ పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని సృజన్ పిల్లల ఆస్పత్రిని శుక్రవారం తనిఖీ చేశారు. డీఎంహెచ్‌వో మాట్లాడుతూ అవసరం లేని వైద్యపరీక్షలు, శస్త్రచికిత్సలు చేయకుండా వైద్యులు నైతిక విలువలను పాటించాలన్నారు. ఆస్పత్రి పిల్లల డాక్టర్ కందేపి ప్రసాదరావు పాల్గొన్నారు.
సీసీ కెమెరాలతో నేరాల నియంత్రణ
కోనరావుపేట(వేములవాడ): గ్రామాల్లో సీసీ కెమెరాలతో నేరాలు నియంత్రణలోకి వస్తాయని వేములవాడ డీఎస్పీ శ్రీనివాసులు పేర్కొన్నారు. మండలంలోని గొల్లపల్లి, కమ్మరిపేట తండాల్లో శుక్రవారం కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమం నిర్వహించారు. సరైన పత్రాలు, నంబర్ ప్లేట్లు లేని 39 బైక్‌లను గుర్తించి, పత్రాలు సమర్పించి తీసుకెళ్లాలని సూచించారు. చందుర్తి సీఐ రవీందర్, ఎస్సైలు ప్రశాంత్‌రెడ్డి, రమేశ్, మోతిలాల్ ఉన్నారు.
వస్త్ర పరిశ్రమను అభివృద్ధి చేయాలి
సిరిసిల్లటౌన్: వస్త్ర పరిశ్రమను అభివృద్ధి చేయాలని మాజీ ఎమ్మెల్సీ చెరుపల్లి సీతారాములు కోరారు. స్థానిక బి.వై.నగర్‌లోని సీఐటీయూ కార్మిక భవన్‌లో తెలంగాణ పవర్‌లూమ్ వర్కర్స్ యూనియన్ ముఖ్య నా యకుల సమావేశం రాష్ట్ర అధ్యక్షుడు మూశం రమేశ్ అధ్యక్షతన శుక్రవారం నిర్వహించారు. వస్త్రపరిశ్రమకు ప్రధాన కేంద్రమైన సిరిసిల్లలో ఆగస్టు 23న సీఐటీయూ అఖిల భారత టెక్స్‌టైల్ కోఆర్డినేషన్ కమిటీ సమావేశాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. నాయకులు కూరపాటి రమేశ్, జిల్లా అధ్యక్షుడు కోడం రమణ, జిల్లా కార్యదర్శి సిరిమల్ల సత్యం పాల్గొన్నారు.
‘పే స్కేల్ అమలు చేయాలి’
సిరిసిల్ల అర్బన్: తమ డిమాండ్లు పరిష్కరించి, పేస్కేల్ అమలు చేసే వరకు ఉద్యమిస్తామని వీబీ–జీ రామ్ జీ ఉద్యోగుల జిల్లా జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్ గుడిసెల రమేశ్ పేర్కొన్నారు. కలెక్టరేట్ వద్ద శుక్రవా రం నిరసన తెలిపారు. కలెక్టర్, డీఆర్‌డీవో, డీపీవో సంబంధిత అధికారులకు వినతిపత్రం అందజేశారు. ఉద్యోగ భద్రత కల్పిస్తూ, పే స్కేల్ అమలు చేయాలని కోరారు. ఎం.ఎ.జమీల్, రాపోలు నాగరాజు, ఎస్‌కే పాషా, శ్రీనివాస్, అరుణ్, తిరుమలేశ్, వెంకటేశ్, గంగజల, మాధవి, అశ్విని, తబిత, వనజ పాల్గొన్నారు.


