సిరిసిల్లటౌన్: అభివృద్ధి పనులపై చర్చ.. అవినీ తి ఆరోపణలపై వాదనలు.. కౌన్సిలర్ల పట్ల అ మర్యాదకర వ్యా ఖ్యలు వంటి అంశాలతో సిరిసిల్ల మున్సిపల్ కౌన్సిల్ సమావేశం రచ్చగా మారింది. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న వైస్‌చైర్మన్‌పై ప్రతిపక్షాలు ఆక్షేపణలు చేశాయి. శుక్రవారం సిరిసిల్ల మున్సిపల్ చైర్‌పర్సన్ జిందం కళ అధ్యక్షతన జరిగిన సమావేశం గరం గరంగా సాగింది. 25 అంశాలతో రూపొందించిన ఎజెండాలో 24 అంశాలను ఆమోదించారు.
వినాయక చవితికి నిధులు
వినాయక చవితి పండుగ సందర్భంగా నిమజ్జన ఏర్పాట్లకు రూ.20లక్షలు కేటాయించినట్లు మున్సిపల్ చైర్‌పర్సన్ జిందం కళ తెలిపారు. మున్సిపల్ సమావేశం అనంతరం చాంబర్‌లో నిర్వహించిన ప్రెస్‌మీట్లో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం సిరిసిల్లలోని పవర్‌బోర్ల చుట్టూ ఇంకుడుగుంతలు నిర్మించాలని తీర్మానించారు. డంపింగ్‌యార్డ్ అభివృద్ధి పరిచేందుకు షెడ్డుల నిర్మాణం, సీసీ ప్లాట్‌ఫామ్స్, ఇంటర్నల్ సీసీ రోడ్డు పనులకు రూ.80 లక్షలు, ఎలక్ట్రికల్ ఆటోలు, ఒక ప్రొక్లెయిన్ కొనుగోలుకు రూ.50 లక్షలు, రోడ్లు, డ్రైనేజీల మరమ్మతు పనులు చేపట్టేందుకు రూ.16.55లక్షలు, ఇంకుడుగుంతల నిర్మాణానికి రూ.30లక్షలు, దోమల నివారణకు కెమికల్స్, స్ప్రేయింగ్ మిషన్స్ కొనుగోలుకు రూ.1.80 లక్షలు కేటాయిస్తూ పరిపాలనపరమైన మంజూరు ఇచ్చినట్లు పేర్కొన్నారు. మున్సిపల్ కమిషనర్ ఖాదిర్‌పాషా, వైస్‌చైర్మన్ దార్ల సందీప్ తదితరులు పాల్గొన్నారు.
బీఆర్‌ఎస్ వర్సెస్ కాంగ్రెస్, బీజేపీ


