108 కలశాలతో అభిషేకం | - | Sakshi
Sakshi News home page

108 కలశాలతో అభిషేకం

Aug 2 2026 12:52 AM | Updated on Aug 2 2026 12:52 AM

వేములవాడ: సంవృద్ధిగా వర్షాలు కురవాలని వేములవాడ రాజన్న క్షేత్రంలో మూడు రోజులుగా నిర్వహిస్తున్న వరుణయాగం శనివారం పూర్ణాహుతితో ముగిసింది. రాష్ట్రంలో నెలకొన్న అనావృష్టి పరిస్థితులు తొలగిపోవాలని సంకల్పించి ఈ మహాయాగం నిర్వహించారు. ఇందులో భాగంగా రుష్యశృంగ మహర్షి ప్రతిష్ఠ, దేవతా పూజలు, గౌరీ పూజలు చేశారు. 108 కలశాలతో ప్రత్యేకాభిషేకాలు చేశారు. ఆలయ ఈవో రమాదేవి, ఏఈవో జయకుమారి, పర్యవేక్షకులు శ్రీనివాస్‌శర్మ, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ప్రతాప రామకృష్ణ, ఆలయ అర్చకులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement