చందుర్తి(వేములవాడ): జాతీయస్థాయి యోగా పోటీల్లో చందుర్తి మండలం దేవునితండాకు చెందిన భూక్య చైత్రహాసిని రెండు గోల్డ్‌మెడల్, బ్రాంజ్ మెడల్ సాధించింది. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ ఎమరాల్డ్ హైట్స్ ఇంటర్నేషనల్ స్కూల్‌లో నిర్వహించిన చాంపియన్‌షిప్‌లో తెలంగాణ జట్టుకు చైత్రహాసిని కెప్టెన్‌గా ప్రాతినిధ్యం వహించింది. రాష్ట్ర జట్టులో 12 మంది సభ్యులు పాల్గొన్నారు. చైత్రహాసిని హై దరాబాద్‌లో ఇంటర్ సెకండియర్ చదువుతుంది.
వస్త్రవ్యాపార సంఘం ఎన్నిక ఏకగ్రీవం
సిరిసిల్లటౌన్: సిరిసిల్ల చేనేత వస్త్ర వ్యాపార సంఘం ఎన్నిక ఆదివారం ఏకగ్రీవమైంది. అ ధ్యక్షుడిగా తాటిపాముల దా మోదర్ రెండోసారి ఎన్నికయ్యా రు. ఉపాధ్యక్షుడిగా గౌడ రాజు, కార్యదర్శిగా శ్రీగాధ విష్ణు, కోశాధికారిగా సామల శ్రీనివాస్, సహాయ కార్యదర్శిగా బొడ్డు శ్రీధర్, కార్యవర్గ సభ్యులుగా సిరిపురం కృష్ణ, గాజుల మల్లేశం, గుండేటి మధుకర్, మేర్గు సత్యనారాయణ, అన్నల్‌దాస్ సురేష్, దూస కృష్ణప్రసాద్, జిందం రవి, కళ్యాడపు పాండురంగం, రిక్కుమల్లె బాలశివరామకృష్ణ, కోడం శ్రీనివాస్ ఎన్నికయ్యారు.


