రుణం నుంచి ఉపాధి దిశగా.. | - | Sakshi
Sakshi News home page

రుణం నుంచి ఉపాధి దిశగా..

Aug 12 2026 12:22 AM | Updated on Aug 12 2026 12:22 AM

జిల్లా సమాచారం

ప్రక్రియ వేగవంతం చేస్తున్నం

● అర్హులైన స్వయం సహాయక సంఘాల సభ్యులకు లబ్ధి చేకూర్చేలా ‘ఈ–కేవైసీ’

● జిల్లాలో కొనసాగుతున్న ప్రక్రియ

గంభీరావుపేట (సిరిసిల్ల): స్వయం సహాయక సంఘాల మహిళలకు స్వయం ఉపాధి అవకాశాలను మరింత విస్తరించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఇప్పటికే పొదుపు సంఘాల ద్వారా ఆ ర్థిక క్రమశిక్షణ, పొదుపు అలవాటు పెరిగిన నేపథ్య ంలో వారిని చిన్నతరహా వ్యాపారాలు, స్వయం ఉ పాధి యూనిట్ల వైపు మళ్లించడంపై దృష్టి సారి స్తోంది. సంఘాల సభ్యులకు రుణాలు అందించేందుకు బ్యాంకర్లు సైతం ఆసక్తి చూపుతున్నారు. ము ఖ్యంగా స్వయం ఉపాధి యూనిట్ల ఏర్పాటును ప్రో త్సహించడం ద్వారా మహిళలు ఇతరులపై ఆ ధారపడకుండా ఆర్థిక స్వావలంబన సాధించే అవకాశం ఏర్పడుతుంది. ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు అర్హత ఉన్న వారికే చేరేలా చర్యలు తీసుకోవడం కీలకం. ఇందులో భాగంగానే స్వయం సహాయక సంఘాల సభ్యులకు ఈ–కేవైసీ తప్పనిసరి చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ ప్రక్రియను పూర్తి చేసేందుకు ఐకేపీ సిబ్బంది క్షేత్రస్థాయిలో నిమగ్నమయ్యారు.

15శాతం పూర్తయిన ఈకేవైసీ

స్వయం సహాయక సంఘాలకు రుణాలు ఇవ్వడం మాత్రమే కాకుండా ఆ రుణాలు ఆదాయాన్ని సృష్టించే వ్యాపారాలుగా మార్చేలా మార్గదర్శకత్వం అవసరం. రుణం పొందిన తర్వాత మార్కెట్‌, శిక్షణ, ఉత్పత్తుల విక్రయం, బ్రాండింగ్‌ వంటి అంశాల్లో సహకారం అందితే మహిళా సంఘాల ఆర్థిక బలం మరింత పెరుగుతుంది. ఆ సమయంలో ఈ–కేవైసీ ప్రక్రియలో సాంకేతిక సమస్యలు, అవగాహన లోపం కారణంగా నిజమైన లబ్ధిదారులు ఇబ్బందులు పడకుండా అధికారులు ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. జిల్లాలో దాదాపు 15శాతం ఈ–కేవైసీ పూర్తయినట్లు అధికారులు చెబుతున్నారు.

‘లోకస్‌’లో నిక్షిప్తం

స్వయం సహాయక సంఘాల్లోని సభ్యుల సమస్త సమాచారాన్ని ఐకేపీ సిబ్బంది శ్రీలోకస్‌శ్రీ యాప్‌లో నిక్షిప్తం చేస్తున్నారు. సంఘాల్లో చేరిన తర్వాత ఆర్థిక ప్రగతి, తీసుకున్న రుణాలు, వాయిదాల చెల్లింపులు, చెల్లించిన వడ్డీ, సీ్త్రనిధి రుణాలు, కొనసాగిస్తున్న వ్యాపారం, లాభాలు తదితర వివరాలను సభ్యురాలి వారీగా నమోదు చేస్తున్నారు. ఈ–కేవైసీ ప్రక్రియలో భాగంగా సభ్యురాలి ఫొటో, ఆధార్‌లో ఉన్న ఫొటో ఒకేలా ఉంటేనే ఈ ప్రక్రియ పూర్తి చేసేందుకు వీలు కలుగుతుంది. ఆధార్‌ అప్‌డేట్‌ చేయించుకోకపోతే ఈ–కేవైసీ ప్రక్రియ పూర్తి కాదు. అదేవిధంగా మొబైల్‌ నంబర్‌ కూడా ఆధార్‌తో అనుసంధానమై ఉండాలి.

నేరుగా అందించేందుకే..

కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు నేరుగా లబ్ధ్దిదారులకు చేరేలా ప్రాధాన్యం ఇస్తోంది. గ్రామపంచాయతీలకు 15వ ఆర్థిక సంఘం నిధులు, రైతులకు కిసాన్‌ సమ్మాన్‌ నిధులు నేరుగా జమ చేస్తున్నా రు. అదేవిధంగా జాతీయ గ్రామీణ జీవనోపాధుల మిషన్‌(ఎన్‌ఆర్‌ఎల్‌ఎం)ద్వారా మహిళా అభ్యున్నతి కి కేటాయించే నిధులను నేరుగా అందించనున్నా రు. కేంద్ర ప్రభుత్వ పథకాలు నేరుగా మహిళా సంఘాల సభ్యులకే చేర్చాలన్న యోచనలో భాగంగా ఈకేవైసీ చేపట్టినట్లు తెలుస్తోంది. దీంతో అనర్హులు పొదుపు సంఘాల్లో కొనసాగడానికి వీలుండదు.

మండలం సభ్యులు ఈ–కేవైసీ

పూర్తయినవారు

గంభీరావుపేట 10,742 2,189

వేములవాడ 3,226 1,958

రుద్రంగి 3,675 2,153

బోయినపల్లి 7,595 1,523

వేములవాడరూరల్‌ 4,907 853

చందుర్తి 7,434 1,097

వీర్నపల్లి 3,447 360

తంగళ్లపల్లి 10,444 1,035

ముస్తాబాద్‌ 11,076 1,019

కోనరావుపేట 10,524 931

ఎల్లారెడ్డిపేట 10,685 905

ఇల్లంతకుంట 10,461 805

మొత్తం 94,216 14,828

ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఈ–కేవైసీ ప్రక్రియను వేగవంతంగా కొనసాగిస్తున్నాం. స్వయం సహాయ సంఘాల్లోని సభ్యులందరూ ఈ–కేవైసీ తప్పనిసరిగా చేయించుకోవాలి. ఈనెలాఖరులోపు ప్రక్రియను పూర్తి చేసేలా పని చేస్తున్నం.

– జయసుధ, ఐకేపీ ఏపీఎం, గంభీరావుపేట

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement