ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి, ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ పోరాటాల ఫలితంగానే ఆరోగ్యశ్రీ పథకం అమలు చేశారని ఎమ్మార్పీఎస్ జిల్లా ఇన్‌చార్జి పుట్ట రవి పేర్కొన్నారు. ఎల్లారెడ్డిపేటలో ఆరోగ్యశ్రీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రభుత్వ ఆస్పత్రి, వృద్ధుల ఆశ్రమంలో పండ్లు, బ్రెడ్ పంపిణీ చేశారు. దాసరి దేవచంద్రన్, సాగర్, అందె చంద్రం, మార్వాడి నర్సయ్య తదితరులు పాల్గొన్నారు.
సిరిసిల్ల అర్బన్: జిల్లా కేంద్రంలో ఎమ్మార్పీఎస్ జిల్లా ఇన్‌చార్జి పుట్ట రవిమాదిగ ఆధ్వర్యంలో శుక్రవారం ఆరోగ్యశ్రీ ఆవిర్భావ వేడుకలు నిర్వహించారు. రవి మాట్లాడుతూ పేద చిన్నారుల గుండె జబ్బుల చికిత్సకు ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ఉచిత చికిత్స కోసం చేసిన ఉద్యమం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనే సామాజిక ఆరోగ్య చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచిందన్నారు. ప్రభాకర్, కానాపురం లక్ష్మణ్, శోభారాణి, మనోజ్‌కుమార్, జింక శ్రీధర్, బడుగు లింగయ్య, చంద్రమౌళి పాల్గొన్నారు.
బోయినపల్లి: మంద కృష్ణమాదిగ పోరాట ఫలితంతోనే ఆరోగ్యశ్రీ ఆవిర్భావమైందని నాయకుడు పుట్ట రవి అన్నారు. కొదురుపాక ఎక్స్ రోడ్డులో శుక్రవారం ఆరోగ్యశ్రీ దినోత్సవం నిర్వహించి పండ్లు పంపిణీ చేశారు. ఎమ్మార్పీఎస్ మండల కన్వీనర్ కొంకటి రమేశ్, నాయకులు చేన్నమనేని పురుషోత్తంరావు, ఆవునూరి ప్రభాకర్, కానాపురం లక్ష్మణ్, కత్తెరపాక రవీందర్, నేదునూరి బాబు, కత్తెరపాక మనోహర్, మల్లారెడ్డి, ధుమల రాములు తదితరులు పాల్గొన్నారు.


