సిరిసిల్లటౌన్: లక్షణాలను ముందే గుర్తిస్తే హైపటైటిస్ వ్యాధిని దరి చేరకుండా చేయొచ్చని నోడల్ ఆఫీసర్ డాక్టర్ వంశీధర్‌గౌడ్ అన్నారు. మంగళవారం ప్రపంచ హెపటైటిస్ దినోత్సవాన్ని పురస్కరించుకుని సిరిసిల్ల జిల్లాసుపత్రిలో కాలేయ వ్యాధులపై అవగాహన కార్యక్రమం నిర్వహించగా ఆయన మాట్లాడారు. కాలేయానికి సోకే హెపటైటిస్–బి, సి వ్యాధులపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలన్నారు. నిరంతరం రోగుల సేవలో ఉండే హెల్త్ కేర్ వర్కర్లు ముందస్తు జాగ్రత్తగా టీకా తీసుకోవాలని సూచించారు. అనంతరం ర్యాలీ, హెల్త్ కేర్ వర్కర్లకు హెపటైటిస్–బి వ్యాక్సినేషన్ డ్రైవ్ నిర్వహించారు. ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ప్రవీణ్‌కుమార్, డిప్యూటీ డీఎంహెచ్‌వో డాక్టర్ నాగేందర్‌బాబు, ఆర్‌ఎంవో డాక్టర్ సుమన్‌మోహన్‌రావు, హెచ్‌ఓడీ డాక్టర్ నాగన్న తదితరులు పాల్గొన్నారు.


