పచ్చని చెట్లు ఎండుతున్నాయ్..
ముస్తాబాద్(సిరిసిల్ల): హరితహరంలో నాటిన మొక్కలు చెట్లుగా మారి.. రోడ్డును హరితవనం చేశాయి. ఎండాకాలంలోనూ పచ్చగా కనువిందు చేసిన ముస్తాబాద్ మండలం పోతుగల్–ఆవునూర్ రహదారిలో ఉన్న ఈ చెట్లు వర్షాకాలంలో ఎండిపోతున్నాయి. పోతుగల్ శివారులోని మానేరు కెనాల్ పక్కన ఉన్న యాభైకి పైగా చెట్లు ఎండిపోవడంపై ప్రకృతి ప్రేమికులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అటవీశాఖ అధికారులు విచారణ చేపట్టి మిగతా చెట్లనైనా కాపాడాలని కోరుతున్నారు.
గంభీరావుపేట(సిరిసిల్ల): ఎట్టకేలకు నర్మాల ఎగువమానేరు ప్రాజెక్టు పరవళ్లు తొక్కుతోంది. ఎగువ ప్రాంతాల నుంచి వచ్చిన వరదతో ప్రాజెక్టు పూర్తిస్థాయిలో నిండి మత్తడి పోస్తోంది. ప్రస్తుతం 900 క్యూసెక్కుల నీరు ప్రాజెక్టులోకి చేరుతోంది. వరద ప్రవాహం పెరిగితే ప్రాజెక్టు ఉధృతంగా పొంగే అవకాశం ఉంది. పరివాహాక ప్రాంతాల రైతులు, గ్రామస్తులను అధికారులు అప్రమత్తం చేస్తున్నారు. వాగు, రోడ్ల వెంబడి రక్షణ చర్యలు చేపట్టారు.


