గ్రామాల్లో సరఫరా చేస్తున్న భగీరథ నీరు కలుషితమై వస్తుంది. నిత్యం పైపులు పగిలిపోతున్నాయి. అధికారులు నిత్యం పైపులను పరిశీలించాలి. ప్రతీ ఇంటికీ నీటి సరఫరా జరిగేలా చూడాలి.
– కొప్పుల మహిపాల్‌రెడ్డి, అక్కపల్లి
లీకేజీలపై అప్రమత్తం చేశాం
జిల్లాలో మిషన్ భగీరథ పైపులైన్ల లీకేజీలపై సిబ్బందిని అప్రమత్తం చేశాం. అక్కపల్లిలో ఓపెన్‌వెల్ పంపుసెట్ రిపేర్ చేయించి మళ్లీ బిగించే క్రమంలో మట్టినీళ్లు వచ్చాయి. వాటిని క్లియర్ చేశాం. ఆ నీటి శాంపిళ్లను సేకరించాం. లీకేజీలు కాకుండా చర్యలు తీసుకుంటున్నాం.
– సుమలత, మిషన్ భగీరథ, ఈఈ


