సిరిసిల్లటౌన్: ఎమ్మెల్యేగా గెలిచిన కేటీఆర్ స్థానికంగా ఉండటం లేదని, ప్రజలకు కనిపించడం లేదని కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు సూర దేవరాజు విమర్శించారు. ఈమేరకు ఆదివారం జిల్లా కేంద్రంలోని గాంధీచౌక్‌లో మహాధర్నా చేపట్టి మాట్లాడారు. ఎన్నికల సమయంలో వారంలో రెండు రోజులు ఇక్కడే ఉంటానని హామీ ఇచ్చి ఇప్పుడు ఆరు నెలలకు రెండు రోజులు కూడా ఉండడం లేదన్నారు. మున్సిపల్ వైస్‌చైర్మన్ దార్ల సందీప్ నేతకార్మికుడైన వెంగళ వెంకటేశ్ కుటుంబాన్ని ఇందిరమ్మ ఇంటి కోసం రూ.లక్ష డిమాండ్ చేస్తే మానసికంగా కుంగిపోయి మృతిచెందాడని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ఎస్సీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆకునూరి బాలరాజు, మహిళా జిల్లా అధ్యక్షురాలు కాముని వనిత, మైనార్టీ జిల్లా అధ్యక్షుడు రియాజ్, కౌన్సిలర్లు కూరపాటి శ్రీశైలం, లింగంపల్లి గంగరాజు, బొద్దుల శ్రీనివాస్, జిల్లా ప్రధాన కార్యదర్శి రాగుల జగన్, వేముల దామోదర్, మంగ కిరణ్, దుబ్బాల వెంకటేశం, వంతడ్పుల రాము, కంసాల మల్లేశం, శ్రీగాథ మైసయ్య పాల్గొన్నారు.


