కలెక్టర్ గరీమా అగ్రవాల్
సిరిసిల్ల: విద్యార్థులు పాఠ్యాంశాలపై పట్టు సాధించి, శ్రద్ధగా చదువుకోవాలని కలెక్టర్ గరీమా అగ్రవా ల్ కోరారు. సుభాష్‌నగర్‌లోని అర్బన్ రెసిడెన్షి యల్ విద్యాలయాన్ని సోమవారం తనిఖీ చేశారు. స్టోర్‌రూమ్‌లో బియ్యం, పప్పులు, గుడ్లు, బెండకాయల నాణ్యత పరిశీలించారు. ఉపాధ్యాయులు, సిబ్బంది హాజరుపై ఆరా తీశారు. విద్యార్థులతో మాట్లాడి, మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం భోజనం పె డుతున్నారా? అని తెలుసుకున్నారు. సైన్స్ పాఠ్యాంశానికి సంబంధించిన ప్రశ్నలు వేసి సమాధానాలు రాబట్టారు. కలెక్టర్ మాట్లాడుతూ ప్రణాళిక ప్రకా రం చదివితే భవిష్యత్‌లో మేలు చేస్తుందన్నారు.
ఓటర్ల రేషనలైజేషన్ చేపట్టాలి
ఒకే కుటుంబానికి చెందిన కుటుంబ సభ్యులు వేర్వేరు పోలింగ్ కేంద్రాల్లో ఓటు ఉంటే, వారిని ఒకే పోలింగ్ కేంద్రం కిందకు వచ్చేలా రేషనలైజేషన్ (హేతుబద్ధీకరణ) పకడ్బందీగా చేపట్టాలని కలెక్టర్ గరీమా అగ్రవాల్ కోరారు. కలెక్టరేట్‌లో రెవెన్యూ అధికారులతో ఎస్‌ఐఆర్‌పై సమీక్షించారు. సర్ డిజి టలైజేషన్ పూర్తి చేయాలన్నారు. సిరిసిల్ల ఆర్డీవో శ్రీధర్‌బాబు, తహసీల్దార్లు మహేశ్, జయంత్‌కుమార్, కలెక్టరేట్ పర్యవేక్షకులు ప్రవీణ్, ఎలక్షన్ సెక్షన్ అధికారి రెహమాన్ తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సుదర్శన్‌రెడ్డి ఇదే అంశంపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.


