గంజాయిని నిర్మూలించాలి | - | Sakshi
Sakshi News home page

గంజాయిని నిర్మూలించాలి

Aug 8 2026 1:05 AM | Updated on Aug 8 2026 1:05 AM

● ఎస్పీ మహేశ్‌ బీ గీతే

● ఎస్పీ మహేశ్‌ బీ గీతే

సిరిసిల్ల: గంజాయి రహిత జిల్లాగా మార్చాలని, వ్యసనాన్ని నిర్మూలించాలని ఎస్పీ మహేశ్‌ బీ గీతే కోరారు. జిల్లాలోని గంజాయి బాధితులకు చికిత్స అందించే డీ–అడిక్షన్‌ సెంటర్‌లో బాధితులకు ఆటవస్తువులు, క్యారం, చెస్‌బోర్డులను జిల్లా ప్రభు త్వ జనరల్‌ ఆస్పత్రి ఆర్‌ఎంవో సుమన్‌మోహన్‌రా వుకు శుక్రవారం అందించారు. ఎస్పీ మాట్లాడుతూ జిల్లాలో గంజాయి, డ్రగ్స్‌ వంటి మాదకద్రవ్యాలను నిర్మూలించడంతోపాటు వ్యసన బాధితులను సాధారణ జీవితంలోకి తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. డీ–అడిక్షన్‌ సెంటర్‌లో చికిత్స పొందుతున్న బాధితులకు మెరుగైన వైద్యసేవలు, సౌకర్యాలు కల్పించాలన్నారు. మత్తు నుంచి బయటపడాలనుకునే వారికి పోలీస్‌ శాఖ ఆధ్వర్యంలో అవసరమైన కౌన్సెలింగ్‌ చేసి, సాధారణ జీవితం గడిపేలా చర్యలు చేపడుతున్నామని తెలి పారు. ఆర్‌ఐ అడ్మిన్‌ సురేష్‌, వైద్యులు పాల్గొన్నారు.

రాజ్యాంగ హక్కులు వినియోగించుకోవాలి

సిరిసిల్లటౌన్‌: రాజ్యాంగం కల్పించిన హక్కులను గిరిజనులు, ఆదివాసీలు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సెక్రటరీ పి.లక్ష్మణాచారి కోరారు. పెద్దూరులో శుక్రవారం నిర్వహించిన ఆదివాసీ దినోత్సవంలో పాల్గొన్నారు. లోక్‌ అదాలత్‌ సభ్యులు ఆడెపు వేణు, గుర్రం ఆంజనేయులు, లీగలైడ్‌ అసిస్టెంట్‌ కౌన్సిల్‌ జ్యోతి, పీఏసీఎస్‌ చైర్మన్‌ కిషన్‌యాదవ్‌, స్థానిక నాయకులు దొంతినేని అశోక్‌రావు, లింగంపల్లి సత్యనారాయణ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement