సిరిసిల్ల: సిరిసిల్లకు చెందిన వెల్ది హరిప్రసాద్ చేనేత నైపుణ్యం స్ఫూర్తిదాయకమని కలెక్టర్ గరీమా అగ్రవాల్ కొనియాడారు. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా హరిప్రసాద్ కార్ఖానాను శుక్రవారం కలెక్టర్ సందర్శించారు. హరిప్రసాద్–రేఖ దంపతులను శాలువాతో సన్మానించారు. మగ్గంపై నేసిన పీతాంబరం, అగ్గిపెట్టెలో పట్టే చీరలను చూసి.. తయారీ ప్రక్రియను తెలుసుకున్నారు. చీర తయారీకి పట్టే సమయం, ముడిసరుకు, పెట్టుబడి వంటి అంశాల గురించి అడిగారు. హరిప్రసాద్ ఇప్పటికే సిరిసిల్ల వస్త్రపరిశ్రమ ఖ్యాతిని జాతీయస్థాయికి తీసుకెళ్లారని, మరిన్ని నూతన ఆవిష్కరణలు చేయాలని ఆకాంక్షించారు. చేనేత, జౌళిశాఖ ఏడీ ఎస్.సంతోష్‌కుమార్, తహసీల్దార్ మహేశ్‌కుమార్ ఉన్నారు.


