వేములవాడ: వేములవాడ మున్సిపల్ చైర్మన్ పుల్కం రాజుతోపాటు వైస్‌చైర్మన్ నరాల శేఖర్, కౌన్సిలర్లు కర్ణాటకలోని ఆధ్యాత్మిక క్షేత్రాల సందర్శనకు వెళ్లారు. భట్కళ్‌లోని ప్రసిద్ధ మురుడేశ్వర ఆలయాన్ని దర్శించుకున్నారు. అనంతరం గోకర్ణ మహాబలేశ్వరం, కొల్లూరులోని శ్రీమూకాంబికాదేవీని దర్శించుకున్నారు.
ఆర్వో వాటర్ ప్లాంట్ ప్రారంభం
వేములవాడఅర్బన్: మండలంలోని అగ్రహారం శ్రీరాజరాజేశ్వరస్వామి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఆర్వో వాటర్ ప్లాంట్‌ను శుక్రవారం ప్రారంభించారు. ప్రిన్సిపాల్ ప్రభాకరాచారి, దాతలు కంటాల శివకుమార్, పెద్ది రాణి, అధ్యాపకులు శంకరయ్య, కుమారస్వామి, సుధాకర్, శ్యామ్, శ్రీనివాస్ పాల్గొన్నారు.
విద్యారంగ సమస్యలు పరిష్కరించాలి
సిరిసిల్లటౌన్: యూపీఎస్సీ ఆధ్వర్యంలో విద్యారంగ సమస్యల సాధనకు శుక్రవారం ఉపాధ్యాయులు నిరసన తెలిపారు. సిరిసిల్లలోని గీతానగర్ బాలికల హైస్కూల్‌లో ప్రీప్రైమరీ ప్రధానోపాధ్యాయులకు శిక్షణ కొనసాగుతున్న నేపథ్యంలో భోజన విరామ సమయంలో నిరసన తెలిపారు.


