సిరిసిల్ల: కార్మికక్షేత్రం.. వస్త్రపరిశ్రమకు నిలయం. వస్త్రోత్పత్తి దశలు కళ్లముందుంచుతూ కలెక్టరేట్ కూడలిలో ఏర్పాటు చేసిన శిల్పాలు ఆకట్టుకుంటున్నాయి. రూ.3.10 కోట్లతో రగుడు బైపాస్ కూడలి సుందరీకరణలో భాగంగా బీటీ రోడ్డు విస్తరణ, హైమాస్ట్ లైట్లు, గ్రీనరీ, రోడ్డు భద్రత చర్యలు, వస్త్రపరిశ్రమలో వివిధ దశల నమూనాలు ఏర్పాటు చేశారు. ఈ కూడలిని రాష్ట్ర మంత్రులు తుమ్మల నాగేశ్వర్‌రావు, పొన్నం ప్రభాకర్‌గౌడ్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ గురువారం ప్రారంభించనున్నారు. ఈమేరకు ఏర్పాట్లను అదనపు కలెక్టర్ గడ్డం నగేశ్, డీఎస్పీ నాగేంద్రచారి బుధవారం పర్యవేక్షించారు.


