మా ఊర్లో ప్రాథమిక పాఠశాల మూతబడి మూడేళ్లు గడుస్తోంది. ఇరువై మంది వరకు పిల్లలను పంపిస్తామని మొన్నటి బడిబాటలో చెప్పాం. సార్లు కూడా వచ్చారు. కానీ తల్లిదండ్రుల్లో నమ్మకం కలిగించకపోవడంతో మళ్లీ ఆర్థికంగా భారమైన ప్రైవేటుకు పంపిస్తున్నాం. పాఠశాల తెరిస్తే పిల్లలను పంపిస్తాం.
– సతీశ్, కొదాటివానిపల్లె
బడులను కాపాడుకోవాలి
గన్నెవారిపల్లెలో ఇంకో టీచర్ కావాలి. కొదాటివానిపల్లెలో ప్రభుత్వ బడిని ఓపెన్ చేసేందుకు సహకరిస్తాం. ఇక్కడ పనిచేసే టీచర్‌ను తిరిగి మా ఊరికి రప్పించాలి. గ్రామస్తుల అందరి సహకారంతో ఊరి నుంచి విద్యార్థులు ప్రైవేటుకు వెళ్లకుండా బడులను కాపాడుకుందాం.
– రేసు రఘు, సర్పంచ్,
గన్నెవారిపల్లె
డిప్యూటేషన్ల ఆర్డర్లు రాలేదు
గతేడాది జరిగిన టీచర్ల సర్దుబాట్లే ఇప్పుడు కొనసాగుతున్నాయి. కొత్తగా డిప్యూటేషన్లు చేపట్టలేదు. విద్యార్థులున్న చోటికి తప్పకుండా టీచర్లను పంపిస్తాం. అవసరమైన చోట వలంటీర్లను నియమించి బోధనకు ఆటంకం లేకుండా చర్యలు చేపడతాం.
– రవీందర్, ఎంఈవో,
ముస్తాబాద్


