సిరిసిల్ల: హైకోర్టు న్యాయమూర్తి, జిల్లా పరిపాలన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.తుకారాంజీ శనివారం సిరిసిల్లకు వచ్చారు. స్థానిక పంచాయతీరాజ్ గెస్ట్‌హౌస్‌లో జిల్లా ఇన్‌చార్జి ప్రధాన న్యాయమూర్తి, జిల్లా మొదటి అదనపు న్యాయమూర్తి బి.పుష్పలత, కలెక్టర్ గరీమా అగ్రవాల్, ఎస్పీ మహేశ్ బీ గీతే పూలమొక్కలతో స్వాగతం పలికారు. జిల్లా కేంద్రంలో నిర్మాణంలో ఉన్న న్యాయస్థాన భవనాలను పరిశీలించారు. పోక్సో కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి రాధిక జైస్వాల్, సీనియర్ సివిల్ న్యాయమూర్తులు పి.లక్ష్మణాచారి, అజయ్‌కుమార్‌జాదవ్, జూనియర్ సివిల్ జడ్జి జి.మేఘన, ఆర్డీవో శ్రీధర్‌బాబు, డీఎస్పీ నాగేంద్రచారి, ఎస్బీ డీఎస్పీ జి.వెంకటేశ్వర్లు, తహసీల్దార్ ఎస్.మహేశ్ పాల్గొన్నారు.


