ఎక్కువ మంది మహిళలు ఉండడం సంతోషకరం | - | Sakshi
Sakshi News home page

ఎక్కువ మంది మహిళలు ఉండడం సంతోషకరం

Aug 6 2026 8:14 AM | Updated on Aug 6 2026 8:14 AM

ఎక్కువ మంది మహిళలు ఉండడం సంతోషకరం ప్రజల చిరునవ్వే నాకు సంతృప్తి ఆత్మవిశ్వాసంతో ఏ లక్ష్యాన్నైనా చేరుకోవచ్చు

కరీంనగర్‌అర్బన్‌: కలెక్టర్‌ చిత్రామిశ్రా పాలనలో పనిచేయడం చాలా సంతోషంగా ఉంది. ఒక మహిళ అధికారిగా ఆమె దిశానిర్ధేశం బాగుంది. ఎక్కువ సంఖ్యలో మహిళలే అధికారులుగా ఉండటం సంతోషకర పరిణామం. ప్రజలకు మరింత సేవ చేయాలనే కాన్ఫిడెన్స్‌ పెరిగింది. సహచరుల సహకారం, ఉన్నతాధికారుల మార్గదర్శకత్వం నాకు ప్రేరణగా నిలుస్తాయి.

– షర్మిళ, కరీంనగర్‌ ఆర్డీవో

మహిళా అధికారిగా పనిచేయడం.. సమాజంలో మార్పు తీసుకురావడానికి లభించిన గొప్ప అవకాశం. మహిళలు, పిల్లలు, దివ్యాంగులు, వద్ధులు, ట్రాన్స్‌జెండర్స్‌ సంక్షేమం కోసం పనిచేయడం ఎంతో ఆత్మసంతృప్తినిస్తుంది. ప్రతీ సవాలును ధైర్యంగా ఎదుర్కొంటూ.. అర్హులైన ప్రతీ లబ్ధిదారుడికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు చేరేలా కృషి చేయడమే నా ప్రధాన లక్ష్యం. ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకోవడం, వారి సమస్యలకు పరిష్కారం చూపడం నా ఉద్యోగంలో అత్యంత విలువైన అంశం.

– సరస్వతి, జిల్లా సంక్షేమాధికారి, కరీంనగర్‌

పరిపాలనలో లభిస్తున్న అవకాశాలు, బాధ్యతలు మాపై మరింత జవాబుదారీతనాన్ని పెంచుతున్నాయి. ప్రజలకు పారదర్శకంగా, వేగవంతంగా సేవలు అందించడమే మా ప్రధాన లక్ష్యం. ప్రస్తుతం ప్రతీ రంగంలో మహిళలు రాణిస్తున్నారు. కుటుంబ, పరిపాలన బాధ్యతలను సమర్థంగా నిర్వహించగలమని నిరూపిస్తున్నారు. ఆత్మవిశ్వాసం, క్రమశిక్షణ, అంకితభావం ఉంటే ఏ లక్ష్యాన్నైనా చేరుకోవచ్చు. మహిళా సాధికారత అంటే సమాజంలో సానుకూల మార్పునకు నాయకత్వం వహించడం. ఆ దిశగా ప్రతి మహిళ ముందుకురావాలి. – అరుణశ్రీ,

స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌, పెద్దపల్లి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement