కార్పొరేట్‌ వర్గాలకు బీజేపీ పెద్దపీట | - | Sakshi
Sakshi News home page

కార్పొరేట్‌ వర్గాలకు బీజేపీ పెద్దపీట

Aug 12 2026 12:22 AM | Updated on Aug 12 2026 12:22 AM

కార్పొరేట్‌ వర్గాలకు బీజేపీ పెద్దపీట

సిరిసిల్లటౌన్‌: కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పేద ప్రజల అభ్యున్నతిని మరిచి కార్పొరేట్ల వర్గాలకు పెద్దపీట వేస్తోందని సీపీఐ పట్టణ కార్యదర్శి పంతం రవి అన్నారు. మంగళవారం సిరిసిల్ల బీవైనగర్‌ నుంచి ప్రజాచైతన్యయాత్రలు ప్రారంభించి మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందన్నారు. సిరిసిల్ల పవర్‌లూమ్‌ పరిశ్రమకు సంబంధించి కార్మికులకు గత ప్రభుత్వ హయాంలో ఇచ్చిన 10శాతం యారన్‌ సబ్సిడీలు తొలగించి కార్మికులను ఓనర్‌గా చేసే వర్కర్‌ టు ఓనర్‌ పథకాన్ని తుంగలో తొక్కిందని తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్ర నాయకుడు గుంటి వేణు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement