యువత ‘మై భారత్‌ పోర్టల్‌’లో నమోదు కావాలి | - | Sakshi
Sakshi News home page

యువత ‘మై భారత్‌ పోర్టల్‌’లో నమోదు కావాలి

Aug 2 2026 12:52 AM | Updated on Aug 2 2026 12:52 AM

సిరిసిల్ల: జిల్లాలోని యువత ‘మై భారత్‌ పోర్టల్‌’లో నమోదు కావాలని అదనపు కలెక్టర్‌ గడ్డం నగేశ్‌ కోరారు. కలెక్టరేట్‌లో శనివారం మై భారత్‌ జిల్లా సలహా కమిటీ సమావేశం జరిగింది. అదనపు కలెక్టర్‌ మాట్లాడుతూ మై భారత్‌ నమోదు డ్రైవ్‌కు సంబంధించి యువకుల్లో అవగాహన పెంచాలన్నారు. నమోదు లక్ష్యాలను సాధించేందుకు ప్రచారం చేపట్టాలన్నారు. మై భారత్‌ ఉమ్మడి జిల్లా అధికారి గోలి తిరుపతిరెడ్డి మాట్లాడుతూ ప్రస్తుతం జిల్లాలో కొనసాగుతున్న మై భారత్‌ ఇంటెన్సివ్‌ నమోదు, అవగాహన డ్రైవ్‌ జూలై 1 నుంచి ఆగస్టు 15 వరకు కొనసాగుతుందన్నారు. డీఆర్డీవో లక్ష్మీనారాయణ, జెడ్పీ సీఈవో వెంకట మాధవరావు, జిల్లా పంచాయతీ అధికారి జయశీల, జిల్లా విద్యాధికారి మొండయ్య, డీపీఆర్వో శ్రీనివాసాచారి, జిల్లా యువజన క్రీడల శాఖ అధికారి అజ్మీరా రాందాస్‌, డీఎంహెచ్‌వో ఏంజెలా ఆల్ఫ్రెడ్‌, మైభారత్‌ జిల్లా కార్యక్రమ అధికారికిరణ్‌కుమార్‌, ఎన్‌ఎస్‌ఎస్‌ ప్రోగ్రాం ఆఫీసర్స్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement