చందుర్తి(వేములవాడ): మండలంలోని లింగంపేట శివారులో చార్వాక వృద్ధుల సంఘానికి కేటాయించిన స్థలంలో విద్యుత్ సబ్‌స్టేషన్ పనులను కొనసాగిస్తే ఊరుకోబోమని చార్వాక సంఘం వ్యవస్థాపక సభ్యుడు దయ్యాల కమలాకర్ అన్నారు. లింగంపేటలో వృద్ధులకు కేటాయించిన స్థలంలో సబ్‌స్టేషన్ పనులు చేపట్టగా అడ్డుకుని అదే ప్రాంతంలో చార్వాక వృద్ధుల సంఘం ఆధ్వర్యంలో బుధవారం రిలే నిరాహర దీక్షలు చేపట్టారు. సంఘం అధ్యక్షుడు ఇందూరి రాములు తదితరులు పాల్గొన్నారు.
చార్వాక వృద్ధుల సంక్షేమానికి వ్యతిరేకం కాదు
చార్వాక వృద్ధుల సంఘం సంక్షేమానికి వ్యతిరేకం కాదని, కొందరు రాజకీయ లబ్ధి కోసం సంఘ సభ్యులను తప్పుదారి పట్టిస్తున్నారని విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. మర్రిగడ్డలో విలేకరులతో మా ట్లాడారు. వృద్ధుల సంఘానికి కేటాయించిన భూ మిలో సబ్‌స్టేషన్ నిర్మించడం లేదని స్పష్టం చేశారు. ముస్కు ముకుందరెడ్డి, నాగం కుమార్ ఉన్నారు.


