న్యూస్‌రీల్
బస్సులో వంద మంది !
ముస్తాబాద్(సిరిసిల్ల): యాభై మంది ప్రయాణించే బస్సులో ఏకంగా వందకు పైగా మహిళలను అపెరల్‌పార్క్‌కు తరలిస్తుండడంపై బీజేపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ పార్టీ మండల అధ్యక్షుడు సౌల్ల క్రాంతికుమార్ ఆధ్వర్యంలో ఆవునూర్‌లో బస్సును శనివారం అడ్డుకున్నారు. పొన్నాల పద్మారెడ్డి, దాసరి విశ్వనాథ్, అంజయ్య, కనమేని శ్రీనివాస్‌రెడ్డి, బోయిని రవి, పిట్ల రాజు, పిట్ల నరేశ్, దేవరాజు, సుధాకర్‌రెడ్డి, మల్లారెడ్డి ఉన్నారు.


