యాప్‌లోనే అన్ని ఎరువులు | - | Sakshi
Sakshi News home page

యాప్‌లోనే అన్ని ఎరువులు

Aug 9 2026 2:28 AM | Updated on Aug 9 2026 2:28 AM

● స్మార్ట్‌ఫోన్లలో ప్లేస్టోర్‌ నుంచి ఈ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవాలి. ● భూమి విస్తీర్ణాన్ని ధ్రువీకరించుకోవాలి. ● రైతు ఆధార్‌ నంబరు నమోదు చేస్తే ఓటీపీ వస్తుంది. అది నమోదు చేసి లాగిన్‌ అయ్యాక ఎరువులను బుక్‌ చేసుకోవచ్చు.

ఎఫ్‌ఎఫ్‌ఎస్‌ను అందుబాటులోకి తెచ్చిన కేంద్రం కొరత, బ్లాక్‌ మార్కెట్‌ను అరికట్టేందుకు నూతన విధానం ఇప్పటికే యాప్‌ ద్వారానే యూరియా విక్రయాలు

గంభీరావుపేట(సిరిసిల్ల): ఎరువుల కొరత, బ్లాక్‌ మార్కెటింగ్‌ను అరికట్టడంతోపాటు రైతులు క్యూలో నిల్చునే ఇబ్బందులను తప్పించేలా కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఎరువుల కొనుగోళ్లకు డిజిటల్‌ విధానానికి శ్రీకారం చుట్టింది. ఇందుకోసం కొత్తగా యాప్‌ను రూపొందించింది. ‘ఫ్రేమ్‌వర్క్‌ ఫర్‌ ఫర్టిలైజర్‌ సేల్స్‌’ (ఎఫ్‌ఎఫ్‌ఎస్‌)ను రెండు రోజుల నుంచి కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది. గతేడాది వానాకాలం సీజన్‌ నుంచి యూరియా కొరత ఏర్పడింది. ఈ ఏడాది డీఏపీ(డై అమ్మోనియం పాస్పేట్‌)కి కూడా అదే పరిస్థితి ఎదురవుతోంది.

కొత్త యాప్‌..

గత యాసంగి సీజన్‌ నుంచి రాష్ట్ర ప్రభుత్వం యూరియా పంపిణీకి ‘ఫర్టిలైజర్‌ బుకింగ్‌ యాప్‌’ను అమల్లోకి తీసుకొచ్చింది. తాజాగా కేంద్రం యూరియాతోపాటు అన్ని ఎరువులను డిజిటల్‌ విధానంలో బుకింగ్‌ చేసుకునేలా చర్యలు చేపట్టింది. యూరియా, డీఏపీ, కాంప్లెక్స్‌, పొటాష్‌ వంటి అన్ని రకాల ఎరువులను ఈ యాప్‌ ద్వారా బుకింగ్‌ చేసుకునే అవకాశం కల్పించారు. ఈ విధానంలో ఎరువుల బుకింగ్‌, కొనుగోలు సులభమవుతుందని వ్యవసాయాధికారులు చెబుతున్నారు. రైతులకు సందేహాలు ఉంటే అందుబాటులోని వ్యవసాయాధికారులు, డీలర్లను సంప్రదించాలని కోరుతున్నారు. జిల్లాలో వానాకాలం సీజన్‌లో దాదాపు 2లక్షల ఎకరాల్లో వరి, 47వేల ఎకరాల్లో పత్తి, ఇతర పంటలు 10వేల ఎకరాల్లో సాగు చేయనున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.

ఇలా డౌన్‌లోడ్‌ చేసుకోవాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement