తారురోడ్డు వేయడంతో రోడ్డు ఎత్తు పెరిగింది. ఎదరుగా భారీ వాహనాలు వస్తే రోడ్డు దిగుదామంటే మట్టి రోడ్డు లోతుగా ఉండి వాహనాలకు కింద పడిపోతున్నాయి. తారు రోడ్డు వేసిన వెంటనే మట్టి పోయించాల్సిన అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారు.
– గసికంటి ప్రవీణ్, ఎన్గల్
ప్రమాదాలు జరుగుతున్నాయి
కాంట్రాక్టర్ రోడ్డు వేసి మొరం పోయకపోవడంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. ద్విచక్ర వాహనాలు, కార్లు ఎక్కువగా ప్రమాదాలకు గురవుతున్నాయి. ఏడాదిగా వందకు పైగానే ప్రమాదాలు జరిగాయి. పాలకులు పట్టించుకోవాలి.– అంబాల శ్రీకాంత్,
బీజేవైఎం నాయకుడు, బండపల్లి


