ఇల్లంతకుంట మండలం అనంతగిరి అన్నపూర్ణ ప్రాజెక్టులో 1.48 టీఎంసీల నీటి నిల్వ ఉన్నట్టు అధికారులు మంగళవారం తెలిపారు. 207 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తున్నట్లు పేర్కొన్నారు.
మిడ్ మానేరులోకి భారీ ఇన్‌ఫ్లో
మిడ్‌మానేరులో నీటిమట్టం మంగళవారం 15.689 టీఎంసీలకు చేరింది. ప్రాజెక్టులోకి ఎల్లంపల్లి నుంచి లక్ష్మీపూర్ గాయత్రీ పంప్‌హౌస్ ద్వారా వరదకాల్వ మీదుగా 12,600 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతోంది. మూలవాగు, మానేరు వాగు నుంచి 6,045 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో కొనసాగుతోంది. వరద నీరు ప్రాజెక్టులోకి తరలుతోంది.


