● పర్యాటకులు హెచ్చరికలు, సూచనలు పాటించాల్సిందే.. ● ఎస్పీ మహేశ్ బీ గీతే
తంగళ్లపల్లి(సిరిసిల్ల): తంగళ్లపల్లి మండలం గోపాలరావుపల్లి శివారులోని మిడ్‌మానేరు బ్యాక్‌వాటర్ ప్రాంతాన్ని ఎస్పీ మహేశ్ బీ గీతే పోలీసు అధికారులతో కలిసి సోమవారం సందర్శించారు. పర్యాటకుల రద్దీని దృష్టిలో ఉంచుకొని అక్కడ చేపడుతున్న భద్రత ఏర్పాట్లు, ముందస్తు జాగ్రత్త చర్యలను పరిశీలించారు. ఎస్పీ మాట్లాడుతూ పర్యాటక ప్రాంతంలో అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా నిరంతరం పోలీస్ పెట్రోలింగ్ నిర్వహించాలన్నారు. ప్రమాదకర ప్రాంతాలను గుర్తించి పర్యాటకులు అటు వైపు వెళ్లకుండా హెచ్చరిక బోర్డులు, రక్షణ ఏర్పాట్లు చేపట్టాలని సూచించారు. పర్యాటకులు పోలీసుల సూచనలు, హె చ్చరికలు పాటించాలన్నారు. డీఎస్పీ నాగేంద్రచారి, తంగళ్లపల్లి ఎస్సై మల్లేశం పాల్గొన్నారు.


