జాతీయ వేదికపై కరీంనగర్‌ కెరటాలు | - | Sakshi
Sakshi News home page

జాతీయ వేదికపై కరీంనగర్‌ కెరటాలు

Jul 29 2026 12:16 AM | Updated on Jul 29 2026 12:16 AM

ఈసారి పతకమే పతకం సాధించడమే

● నేషనల్‌ టేబుల్‌ టెన్నిస్‌ బరిలో

జిల్లా క్రీడాకారులు

● ఆగస్టు 16 నుంచి 23 వరకు

కాన్పూర్‌లో పోటీలు

ఢిల్లీ, డయ్యూడామన్‌, తమిళనాడులో జరిగిన ఎస్‌జీఎఫ్‌ జాతీయ పోటీల్లో మూడుసార్లు పాల్గొన్నాను. పతకం సాధించలేదు. ఈ సారి తప్పకుండా పతకం సాధిస్తా. టేబుల్‌ టెన్నిస్‌లో దేశానికి ప్రాతినిథ్యం వహించడమే నా లక్ష్యం. ఆ లక్ష్యాన్ని సాధించేందుకు ప్రతిరోజూ సాధన చేస్తున్నా.

– ఎల్లా అవనిరెడ్డి

రాష్ట్రస్థాయి పోటీల్లో జరిగిన టేబుల్‌ టెన్నిస్‌ పోటీల్లో మూడుసార్లు పాల్గొన్నాను. చీఫ్‌ మినిస్టర్స్‌ కప్‌లో 3వ స్థానం సాధించాను. జిల్లాస్థాయి పోటీల్లో 19 పతకాలు గెలుచుకున్నాను. ప్రస్తుతం జరుగనున్న పోటీల్లో పతకం సాధించడమే నా లక్ష్యం.

– కటికిరెడ్డి అద్వికనాథ్‌

కరీంనగర్‌స్పోర్ట్స్‌: కరీంనగర్‌ క్రీడాకారులు జాతీయస్థాయిలో సత్తా చాటడానికి సిద్ధమయ్యారు. స్థానిక స్పోర్ట్స్‌ అకాడమీకి చెందిన టేబుల్‌ టెన్నిస్‌ ఆటగాళ్లు వచ్చే ఆగస్టులో ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో జరిగే నేషనల్‌ ర్యాంకింగ్‌ టేబుల్‌ టెన్నిస్‌ చాంపియన్‌షిప్‌–2026కు రాష్ట్ర జట్టు తరఫున ప్రాతినిథ్యం వహించేందుకు ఎంపికయ్యారు. ఆగస్టు 16 నుంచి 23వ తేదీ వరకు ఈ పోటీలు జరగనున్నాయి. ఇందుకోసం క్రీడాకారులు ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం సుమారు ఐదు గంటల పాటు కఠినమైన సాధన చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement