ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): మండలంలోని రాచర్లగొల్లపల్లి శివారులోని శ్రీరాజరాజేశ్వర పారాబాయిల్డ్ రైస్‌మిల్లులో బుధవారం స్టేట్ విజిలెన్స్ అధికారులు తనిఖీలు చేపట్టారు. దుమాల గ్రామ శివారులో పదిర గ్రామానికి చెందిన పది మంది దళితులకు దళితబంధులో మంజూరైన పారబాయిల్డ్ రైస్‌మిల్లును వారు నిర్వహించడం లేదు. దీంతో ఆ మిల్లును శ్రీరాజరాజేశ్వర పారాబాయిల్డ్ రైస్‌మిల్లు యాజమాన్యం అద్దెకు తీసుకొని గోదాంగా వినియోగించుకుంటున్నట్లు విజిలెన్స్ అధికారులకు వారు తెలిపారు. విజిలెన్స్ డీఎస్పీ విలేకరులతో మాట్లాడుతూ తనిఖీలు పూర్తికాలేవని, పూర్తి వివరాలు తర్వాత వెల్లడిస్తామని తెలిపారు.


