ఆర్థిక ఇబ్బందులతో ట్రాక్టర్‌ డ్రైవర్‌ ఆత్మహత్య | - | Sakshi
Sakshi News home page

ఆర్థిక ఇబ్బందులతో ట్రాక్టర్‌ డ్రైవర్‌ ఆత్మహత్య

Jul 29 2026 12:16 AM | Updated on Jul 29 2026 12:16 AM

గంభీరావుపేట(సిరిసిల్ల): గంభీరావుపేట మండలకేంద్రానికి చెందిన పిట్ల రాములు(41) అనే వ్యక్తి ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు, కుటుంబసభ్యుల కథనం ప్రకారం.. రాములు ట్రాక్టర్‌ డ్రైవర్‌గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. నాలుగు నెలల క్రితం ఫైనాన్స్‌ ద్వారా ట్రాక్టర్‌, గడ్డి కట్టల మిషన్‌ తీసుకున్నాడు. ఆశించిన స్థాయిలో పని దొరక్కపోవడంతో ఇప్పటి వరకు ఫైనాన్స్‌ కిస్తీలు చెల్లించలేక ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నాడు. ఫైనాన్స్‌ వారు ట్రాక్టర్‌ను తీసుకెళ్తారేమోనని మానసిక ఆందోళనకు గురయ్యాడు. తాను చనిపోతే ఆర్థిక సమస్యలు ఉండవని గత కొన్ని రోజులుగా కుటుంబ సభ్యులతో చెబుతున్నట్లు పేర్కొన్నారు. ఈ క్రమంలో మంగళవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శ్రీకాంత్‌ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement