జిల్లాలో దంచి కొట్టిన వానలు ఎల్లారెడ్డిపేటలో అత్యధికంగా 105.9 మి.మీ వర్షం మధ్యమానేరులోకి మానేరు వరద ఎగువ మానేరులో చేరుతున్న వరద మత్తడి దూకుతున్న మూలవాగు జలాశయం
సిరిసిల్ల/గంభీరావుపేట/ఇల్లంతకుంట/బోయినపల్లి: సిరిసిల్ల పట్టణ శివారులోని మానేరువాగు భారీ వర్షాలతో పారుతోంది. గంభీరావుపేట మండలం నర్మాల ఎగువ మానేరు జలాశయం ఇంకా పూర్తి స్థాయిలో నిండకపోయినా.. ఎల్లారెడ్డిపేట, వీర్నపల్లి, తంగళ్లపల్లి, గంభీరావుపేట మండలాల్లో కురిసిన వర్షంతో పాటు, అనుబంధ ఒర్రెల ద్వారా వచ్చి మానేరులో చేరడంతో వాగు పారుతుంది. వరద నీరు మధ్యమానేరు జలాశయంలోకి చేరుతుంది. మరోవైపు కామారెడ్డి జిల్లా నుంచి పాల్వంచ వాగు, సిద్దిపేట జిల్లా నుంచి కూడెల్లి వాగు ద్వారా వరద వచ్చి చేరడంతో ఎగువ మానేరు నిండుతుంది. ఒకడ్రెండు రోజుల్లో మత్తడి దూకనుంది. కోనరావుపేట మండలం నిమ్మపల్లి మూలవాగు జలాశయం నిండడంతో మత్తడి దూకగా, వేములవాడ మూలవాగు పారుతుంది. ఆ వరదంతా మధ్యమానేరులోకి చేరుతుంది.
తడిసి ముద్దయిన జిల్లా
జిల్లావ్యాప్తంగా సోమవారం రాత్రి నుంచి మంగళవారం వేకువజాము వరకు వర్షం కురవడంతో జిల్లా తడిసి ముద్దయింది. సిరిసిల్ల పట్టణ నడిబొడ్డున నేతన్న చౌక్ వద్ద వర్షం నీరు, మురికి నీరు రోడ్డు ఎక్కింది. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. వేములవాడలోనూ
లోతట్టు ప్రాంతాల్లో వరద చేరింది.


