9 కొత్త పీఏసీఎస్‌ల ఏర్పాటుకు ప్రతిపాదనలు ఆశావహులకు ఏడాదిన్నరగా ఎదురుచూపులే ప్రస్తుతం 24 సహకార సంఘాలు నామినేటెడ్ పాలకవర్గాల ఏర్పాటుకు ప్రభుత్వం ఆదేశాలు
చందుర్తి(వేములవాడ): జిల్లాలోని రైతులకు సహకార సంఘాల సేవలను మరింత చేరువ చేయాలని కొత్త సంఘాల ఏర్పాటుకు చేసిన ప్రతిపాదనలకు మోక్షం కలగడం లేదు. ఏడాదిన్నరగా ఇటు రైతులకు.. పదవులపై ఆశపెట్టుకున్న రాజకీయ నాయకులకు ఎదురుచూపులే మిగిలాయి. జిల్లాలో ప్రస్తుతం ఉన్న 24 సహకార సంఘాలతోపాటు మరో 9 సంఘాల ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపారు. దీనిపై ఎలాంటి ఆదేశాలు రాకపోగా.. ఇప్పటికే ఉన్న వాటికి నామినేటెడ్ పాలకవర్గాల ఏర్పాటుకు ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది.
ఏడాన్నర క్రితమే ప్రతిపాదనలు
జిల్లా వ్యాప్తంగా 24 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు ఉన్నాయి. వీటి ద్వారా రైతులు ఇప్పటికే కొనుగోలు కేంద్రాలు, గోదాంలను ఏర్పాటు చేసిన ఎరువుల బస్తాలను, విత్తనాలను అందజేస్తున్నాయి. కొన్ని సొసైటీల్లో పెట్రోల్ బంకులను ఏర్పాటు చేసిన సంఘాలు ఆర్థిక అభివృద్ధికి తోడ్పాటును అందిస్తున్నారు. రైతుకు మరింత చేరువ అయ్యే దిశగా సహకార సంఘాల అడుగులు పడుతున్నాయని ఆశపడుతున్న అన్నదాతలకు ఏడాదిన్నరగా కొత్త సంఘాలపై స్పష్టత కరువైంది. గతంలో నష్టాల బాటలో ఉన్న కొన్నింటిని మూసివేశారు. అయితే తర్వాత ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటుతో ఆర్థికాభివృద్ధి సాధించాయి. కొత్త మండలాల ఏర్పాటుతో రైతులకు సేవలను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు 9 కొత్త సంఘాల ఏర్పాటుకు ప్రతిపాదనలు చేశారు.
నూతన సంఘాలకు ప్రతిపాదనలు
మండలం గ్రామం
ఇల్లంతకుంట కందికట్కూర్
ఇల్లంతకుంట పెద్దలింగాపూర్
రుద్రంగి రుద్రంగి
కోనరావుపేట నిమ్మపల్లి
వీర్నపల్లి వీర్నపల్లి
చందుర్తి నర్సింగపూర్
తంగళ్లపల్లి బద్దెనపల్లి
తంగళ్లపల్లి తంగళ్లపల్లి
వేములవాడ చెక్కపల్లి


