ఇల్లంతకుంట: మండలంలోని జంగారెడ్డిపల్లె ప్రాథమిక పాఠశాలలో ఐదు తరగతుల్లో కలిసి 26 విద్యార్థులు చదువుతున్నారు. వీరికి ఇద్దరు టీచర్లు డిప్యూటేషన్‌పై వస్తున్నారు. అయితే వీరందరిని ఒకే తరగతిగదిలో కూర్చోబెట్టి పాఠాలు బోధిస్తున్నారు. అదే తరగతిగదిలో ఆఫీస్ రూమ్ సైతం ఏర్పాటు చేసుకున్నారు. అదనపు తరగతి గది కోసం రూ.4లక్షలు మంజూరుకాగా.. నిధులు సరిపోకపోవడంతో స్లాబ్ లెవల్ వరకే ఆ గది పనులు జరిగి నిలిచిపోయాయన్నారు. అదనపు తరగతిగది పూర్తి చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు.


