వేములవాడ/వేములవాడరూరల్: వేములవాడలో అధికారులు అక్రమ నిర్మాణాలకు అనుమతులు ఇస్తూ వసూళ్లకు పాల్పడుతున్నారు. స్థానికంగా జగిత్యాల బస్టాండ్ కోసం ప్రభుత్వం 2017లో భూమి సేకరించింది. సుమారు 20.20 ఎకరాల్లో ఎలాంటి నిర్మాణాలకు అనుమతి ఇవ్వరాదని జిల్లా అధికారులు గతంలో ఉత్తర్వులు ఇచ్చారు. ఆ స్థలంలో 2026 మే 1, జూన్ 23 తేదీల్లో రెండు నిర్మాణాల కోసం మున్సిపల్, టౌన్ ప్లానింగ్ అధికారులు అనుమతులు ఇచ్చారు. ఆ అనుమతులు రద్దు చేయాలి.
– రామతీర్థపు మాధవి, మున్సిపల్
మాజీ చైర్‌పర్సన్, 9వ వార్డు కౌన్సిలర్


