● కలెక్టర్ గరీమా అగ్రవాల్ ● 196 అర్జీలు స్వీకరణ
సిరిసిల్ల అర్బన్: తమ సమస్యలు విన్నవించేందుకు జిల్లా నలుమూలల నుంచి కలెక్టరేట్‌కు వందల సంఖ్యలో బాధితులు తరలివచ్చారు. అర్జీలు స్వీకరించిన కలెక్టర్ గరీమా అగ్రవాల్ మాట్లాడుతూ ప్రజావాణిలో వచ్చిన సమస్యలను త్వరగా పరిష్కరించాలని అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా 196 మంది నుంచి వివిధ సమస్యలపై అర్జీలు స్వీకరించారు. సిరిసిల్ల, వేములవాడ ఆర్డీవో కార్యాలయాల్లో 9 దరఖాస్తులు రాగా వాటి పరిష్కారం కోసం సంబంధిత శాఖల అధికారులను ఆదేశించినట్లు కలెక్టర్ తెలిపారు.


