వేములవాడ: రాజరాజేశ్వర దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అన్నదాన సత్రాన్ని ఈవో రమాదేవి సోమవారం తనిఖీ చేశారు. భోజనం చేస్తున్న భక్తుల వద్దకు వెళ్లి నాణ్యత, రుచిపై ఆరా తీశారు. అనంతరం సత్రంలోని వంటశాల, భోజనశాల పరిశుభ్రతను పరిశీలించారు. అంతకుముందు భీమేశ్వరస్వామి ఆలయంలోని కోడె టికెట్ కౌంటర్లు, దీపాల కౌంటర్లు, రెండు చెక్‌పోస్టులను పరిశీలించారు. కొబ్బరి వ్యర్థాలను డస్ట్‌బిన్‌లోనే వేయాలని భక్తులకు అవగాహన కల్పించాలని సిబ్బందికి సూచించారు. ఇన్‌చార్జి ఒన్నారం భాస్కర్, ఇతర సిబ్బంది ఉన్నారు.
మత్తుకు దూరంగా ఉండాలి
వేములవాడ అర్బన్: విద్యార్థులు మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని అగ్రహారం డిగ్రీ కాలేజీ ప్రిన్సిపాల్ టి.శంకర్ కోరారు. కాలేజీలో సోమవారం ‘నషా ముక్త్ యువ – వికసిత్ భారత్’ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు, అధ్యాపకులు ప్రతిజ్ఞ చేశారు. ప్రి న్సిపాల్ శంకర్ మాట్లాడుతూ మత్తు వ్యసనా లను నిర్మూలించి, ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి కృషి చేయాలని కోరారు. యాంటీ డ్రగ్ కమిటీ కోఆర్డినేటర్లు డాక్టర్ కె.వై.కరుణ, జి. ధర్‌రావు తదితరులు పాల్గొన్నారు.
బకాయిలు చెల్లించాలని స్టార్టర్ తొలగింపు
కోనరావుపేట(వేములవాడ): మండలంలోని మరిమడ్లలో గ్రా మపంచాయతీ చెల్లించాల్సిన రూ.1.30 లక్షల బకాయిలు రాకపోవడంతో బస్టాండ్ సమీపంలోని తాగునీటి బోరు స్టార్టర్‌ను మాజీ సర్పంచ్ జింక పోషవ్వ కుమారుడు శ్రీనివాస్ సోమవారం తొలగించారు. శ్రీనివాస్ మాట్లాడుతూ గతంలో తాగునీటి సమస్య పరిష్కారానికి సొంత నిధులతో బోర్లు వేయించానని, బిల్లులు చెల్లించడం లేదన్నారు.
అసైన్డ్ భూములను పేదలకు అందించాలి
సిరిసిల్ల అర్బన్: ప్రభుత్వానికి సంబంఽధించిన అసైన్డ్ భూములను భూమి లేని అన్ని సామాజికవర్గాల నిరుపేదలకు పంపిణీ చేయాలని దళితహక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు తాళ్లపల్లి లక్ష్మణ్ కోరారు. జిల్లా దళిత హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. వారు మాట్లాడుతూ ప్రభుత్వ భూములను భూభారతిలో చూపించి, నిరుపేదలకు పంపి ణీ చేసి పట్టాలు అందజేయాలని కోరారు. ఇండ్లు లేని నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలన్నారు. జిల్లా కన్వీనర్ గజ్జెల ప్రభాకర్, గొల్ల బాబు, పండుగ చంద్రన్న, ఎల్లన్న, జాన్సన్, కవిత, అనిత పాల్గొన్నారు.
ఎస్జీఎఫ్ సెక్రటరీగా రవీందర్‌రావు
సిరిసిల్లటౌన్: ఎస్జీఎఫ్ జిల్లా సెక్రటరీగా జోగినపల్లి రవీందర్‌రావును ఎన్నుకున్నారు. సిరిసిల్లలో సోమవారం నిర్వహించిన సమావేశంలో ఈమేరకు ఎన్నుకున్నారు. జిల్లా క్రీడల అధికారి అజ్మీర రామదాసు, ప్రధానోపాధ్యాయులు మోతిలాల్, జిల్లా స్పోర్ట్స్ నోడల్ ఆఫీసర్ దేవత ప్రభాకర్, పీఈటీఏ అధ్యక్షుడు అనిల్‌గౌడ్, సురేశ్, రిటైర్డ్ ఫిజికల్ డైరెక్టర్ గొట్టే అంజయ్య పాల్గొన్నారు.


