● వేములవాడ బస్టాండ్‌లో నిలిచిన సేవలు ● పట్టించుకోని అధికారులు
వేములవాడ: వేములవాడ ఆర్టీసీ బస్టాండ్‌లో కార్గో ప్యాకేజ్/పార్శిల్ సేవలు అందుబాటులో లేక స్థానికులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ఆర్టీసీ కార్గో సేవలు ఇక్కడ నిర్లక్ష్యానికి గురవుతున్నాయి. వేములవాడ నుంచి ఇతర ప్రాంతాలకు అత్యవసరంగా ఏదైనా పార్శిల్ పంపాలన్నా, బయటి నుంచి వచ్చే పార్శిళ్లను తీసుకోవాలన్నా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చిన్న పార్శిల్ పంపాలన్నా 12 కిలోమీటర్ల దూరంలోని సిరిసిల్ల, 35 కిలోమీటర్ల దూరంలోని కరీంనగర్‌కు వెళ్లాల్సిన దుస్థితి నెలకొంది. దీంతో సమయంతో పాటు రవాణా భారం పడుతోందని స్థానికులు వాపోతున్నారు. బస్టాండ్‌లో అన్ని వసతులు ఉన్నా, డిపో అధికారులు కార్గో కౌంటర్ నిర్వహణను పట్టించుకోకపోవడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
టెండర్ ప్రక్రియలో ఉంది
వేములవాడ బస్టాండ్‌లో కార్గో పార్సిల్ సర్వీసు సేవలు నిలిచిపోయాయి. మూడుసార్లు టెండర్ కాగా సరైన గిడ్ రాకపోవడంతో రద్దయింది. మరోసారి టెండర్ నిర్వహించి ప్రయాణికులు, స్థానికులకు ఇబ్బందులు లేకుండా చూస్తాం.
– బోనాల శ్రీనివాస్, డీఎం, వేములవాడ


