ముస్తాబాద్(సిరిసిల్ల): కాషాయం అంటేనే కాంగ్రెస్‌కు భయం పట్టుకుందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి అన్నారు. ముస్తాబాద్‌లో పంచాయతీ భవనంపై కాషాయరంగు తొలగించడాన్ని నిరసిస్తూ బీజేపీ నాయకులు చేపట్టిన దీక్ష శిబిరాన్ని మంగళవారం సందర్శించి, వారికి సంఘీభావం తెలిపారు. నిబంధనల మేరకు కార్యాలయ భవనానికి సర్పంచ్, పాలకవర్గం రంగులు వేశారన్నారు. అక్షరాలు బాగా కనబడాలే అనే ఉద్దేశంతో కాషాయ రంగు వేస్తే కాంగ్రెస్ నేతలకు ఎందుకు అభ్యంతరమో చెప్పాలన్నారు. అధికారులు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తూ ప్రజాస్వామ్యాన్ని అపహస్యం చేశారన్నారు. అధికారులపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ను కొరారు. సర్పంచ్ మట్ట వెంకటేశ్వర్‌రెడ్డి, మండల అధ్యక్షుడు క్రాంతి, జిల్లా ఉపాధ్యక్షుడు సంతోష్‌రెడ్డి, మీస సంజీవ్, పద్మ, శ్రీనివాస్‌రావు, గోపి, రాంగోపాల్, మహేందర్, సత్తయ్య, మల్లేశ్ తదితరులు పాల్గొన్నారు.


