సిరిసిల్లటౌన్: వర్క్‌షాప్స్ నైపుణ్యాలు పెంపొందుతాయని సిరిసిల్ల డీఎస్పీ కె.నాగేంద్రచారి పేర్కొన్నారు. జిల్లా ఫొటో అండ్ వీడియోగ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన ప్రత్యేక వర్క్‌షాప్‌నకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఫొటోగ్రఫీ నిపుణులు భూపాల్‌కుమార్, ఫారుక్‌ఖాన్, గౌరీశంకర్, కెనాన్ మేనేజర్ విష్ణు పలు మెలకువలు నేర్పించారు. రాష్ట్ర అసోసియేషన్ అధ్యక్షుడు హుస్సేన్, రాష్ట్ర కార్యదర్శి సిరి రవి, అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు గాజుల శ్రీనివాస్, జిల్లా ప్రధాన కార్యదర్శి సుధగోని సురేశ్, కోశాధికారి సబ్బని ప్రకాశ్ తదితరులు పాల్గొన్నారు.
‘ఉద్యమకారులను గుర్తించాలి’
ఇల్లంతకుంట(మానకొండూర్): తెలంగాణ సాధన కోసం పోరాడిన ఉద్యమకారులను గుర్తించి, గౌరవించాలని తెలంగాణ ఉద్యమకారుల ఫోరం (టీయూఎఫ్) రాష్ట్ర అధ్యక్షుడు ఓరుగంటి ఆనంద్ డిమాండ్ చేశారు. ఇల్లంతకుంటలో సోమవారం బట్టి చంద్రమౌళి అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. మలిదశ తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వారికి న్యాయం చేయాలని కోరారు. పెన్షన్, ఇళ్ల స్థలాలు, రూ.10లక్షల ఆర్థిక సహాయం అందించాలని కోరారు. రాష్ట్ర ఉపాధ్యక్షుడు రవీందర్‌రెడ్డి, ఉమ్మడి కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు కనకం కుమారస్వామి, జిల్లా అధ్యక్షుడు వెంగళ శ్రీనివాస్, సర్పంచ్ ఎం.రాజు, నాయకులు కోటేశ్వర్, చల్ల నవీన్‌రెడ్డి, మచ్చ రాజేశం, చల్ల నారాయణ, బట్టి చంద్రమౌళి, గజ్జల రాజశేఖర్‌గౌడ్ పాల్గొన్నారు.
హామీలు నెరవేర్చాలి
సిరిసిల్లటౌన్/సిరిసిల్లఅర్బన్: తెలంగాణ ఉద్యమకారులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాలని బీఆర్‌ఎస్వీ రాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శి గజ్జెల దేవరాజు కోరారు. ఉద్యమకారుల సమస్యల పరిష్కారానికి సోమవారం జిల్లా కేంద్రంలో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో మాట్లాడారు. ప్రత్యేక రాష్ట్ర సా ధనకోసం పోరాడిన యోధులుగా గుర్తించి ప్రభుత్వం నుంచి 250 గజాల నివేశన స్థలం, రూ.25వేల పింఛన్, ఉచిత బస్‌పాస్, ఉచిత వైద్యం అందించాలని కోరారు. బీఆర్‌ఎస్ పట్టణ అధ్యక్షుడు జిందం చక్రపాణి, రాచర్ల వెంకన్న తదితరులు పాల్గొన్నారు.
మిద్దె రాములు జయంతి
వేములవాడ/వేములవాడరూరల్: అంతర్జాతీయ ఒగ్గుకథ కళాకారుడు మిద్దె రాములు జయంతిని అమెరికాలోని చార్లెట్ నగరంలో సోమవారం నిర్వహించారు. కాలిఫోర్నియాలో ‘సిలికానాంధ్ర రజతోత్సవానికి హాజరైన మిద్దె రాములు కుమారుడు పర్శరాములు, మనువడు వినీత్ ఆధర్యంలో నిర్వహించిన జయంతికి అక్కడే ఉంటున్న తెలుగు ప్రజలు హాజరయ్యారు. బొందిల శ్రీనివాస్, రాజారెడ్డి, నాగిరెడ్డి, కేవీ రావు, సతీశ్, అశోక్, కిరణ్, పురుషోత్తం, హరీశ్, భారత్, రామ్, సురేశ్, రవి పాల్గొన్నారు.
ప్రశాంతంగా వీర్నపల్లి బంద్
వీర్నపల్లి(సిరిసిల్ల): మండలకేంద్రంలో అసంపూర్తిగా నిలిచిన రోడ్డు విస్తరణ, సీసీ పనులు పూర్తి చేయాలని కోరతూ బీజేపీ మండల శాఖ ఆధ్వర్యంలో సోమవారం చేపట్టిన వీర్నపల్లి బంద్ ప్రశాంతంగా ముగిసింది. మండలకేంద్రంలో వ్యాపారులు స్వచ్ఛందంగా బంద్‌కు సహకరించారు. అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఎస్సై వేముల లక్ష్మణ్ ఆధ్వర్యంలో బందోబస్తు చేపట్టారు. బీజేపీ మండల అధ్యక్షుడు మాలోత్ లక్పతినాయక్ తదితరులు బంద్‌ను పర్యవేక్షించారు.


