బకాయిలు లేకుండా చూడాలి | - | Sakshi
Sakshi News home page

బకాయిలు లేకుండా చూడాలి

Aug 7 2026 3:53 AM | Updated on Aug 7 2026 3:53 AM

బకాయిలు లేకుండా చూడాలి అద్దకం పరిశ్రమను ఆధునికీకరించాలి చెల్లింపులు జాప్యం చేయొద్దు వర్కర్లను ఓనర్లను చేయాలి

ప్రభుత్వ ఆర్డర్లతో సిరిసిల్ల వస్త్రోత్పత్తి రంగానికి ఎంతో మేలు కలిగింది. కార్మికులకు మెరుగైన ఉపాధి లభిస్తోంది. అయితే బిల్లుల చెల్లింపులు వెంటనే అందిస్తే మరీ మంచిది. ఆర్థికంగా ఇబ్బంది లేకుండా పరిశ్రమ సవ్యంగా నడుస్తోంది. పీసీ ఆర్డర్లు టెండర్ల ద్వారా కాకుండా నేతన్నల ద్వారా కొనుగోలు చేయాలి.

– ఆడెపు భాస్కర్‌,

పాలిస్టర్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు

సిరిసిల్లలోని డయింగ్‌ పరిశ్రమ పురాతనమైంది. దీన్ని ఆధునీకరిస్తూ ఒకే ప్రాంతంలో మౌలిక వసతులు కల్పించాలి. నీటివసతి కల్పించి రంగులు, రసాయనాల నీటిని శుద్ధి చేసే ప్లాంటు ఏర్పాటు చేయాలి. అద్దకం పరిశ్రమ తిరోగమనంలో ఉంది. ఆధునిక క్లాత్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లకు చేయూతనివ్వాలి.

– తాటిపాముల దామోదర్‌, వస్త్రోత్పత్తిదారుడు

ప్రభుత్వ వస్త్రోత్పత్తి ఆర్డర్లతో సిరిసిల్ల పరిశ్రమ సంక్షోభం లేకుండా నడుస్తోంది. కొనుగోలు చేసిన వస్త్రానికి సంబంధించిన చెల్లింపులు జాప్యం చేయొద్దు. కార్మికులకు వెంటనే పేమెంట్స్‌ ఇవ్వాలి. నిర్ణీత గడువులోగా చెల్లింపులు ఇస్తే ప్రణాళిక ప్రకారం వస్త్రోత్పత్తి సాగుతోంది.

– దూడం శంకర్‌, సిరిసిల్ల పద్మశాలీ సంఘం అధ్యక్షుడు, వస్త్రోత్పత్తిదారుడు

నేతకార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వం అనేక ఆర్డర్లు ఇస్తున్నా శ్రమించే కార్మికులకు బట్టకు, పొట్టకే సరిపోతుంది. వర్కర్లను ఓనర్లను చేసే పథకాన్ని అమలు చేస్తే నేతకార్మికులకు మెరుగైన ఉపాధి లభిస్తుంది. చిన్నతరహా పరిశ్రమలకు వ్యవసాయానికి ఇచ్చినట్లుగా ఉచిత విద్యుత్‌ ఇవ్వాలి. విద్యుత్‌ బకాయిలను మాఫీ చేయాలి. కార్మికుడికి నేరుగా ప్రయోజనం దక్కేలా పథకాలు అమలు చేయాలి.

– మూషం రమేశ్‌, కార్మిక నాయకుడు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement