దరఖాస్తుకు మిగిలింది ఐదు రోజులే..
గంభీరావుపేట(సిరిసిల్ల): ఆర్థిక ఇబ్బందులు.. ఇతర కారణాలతో ఉన్నత చదువులకు దూరమయ్యారా.. అయి తే అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ చదువులు అందుబాటులో ఉన్నాయి. చదువు మధ్యలో ఆపేసిన వారికి ప్ర భుత్వం చక్కటి అవకాశం కల్పిస్తోంది. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఉన్నత చదువులు అభ్యసించి జీవితంలో ఉన్నతంగా స్థిరపడిన వా రు ఎంతోమంది ఉన్నారు. ఈ యూనివర్సిటీ నుంచి డిగ్రీ పట్టా పొందిన వారు రెగ్యులర్ డిగ్రీ పూర్తి చేసిన వారితో సమానం. ప్రభుత్వ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. కింది స్థాయి ఉద్యోగులు ఓపెన్ డిగ్రీ పట్టాతో పదోన్నతులు పొందవచ్చు. గంభీరావుపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో దూరవిద్య సెంటర్ అందుబాటులో ఉంది. ఇంటర్ స మాన విద్యార్హతలు గల వారు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంది. ప్రస్తుతం బీఏ, బీకాం, బీఎస్సీ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. నచ్చి న కోర్సులు ఎంచుకొని మూడేళ్లలో డిగ్రీ పూర్తి చే యవచ్చు. ఈ విద్యా సంవత్సరం ప్రవేశాలకు ఈ నెల 7వ తేదీ వరకు గడువు ఉంది. అభ్యాసకులకు ఉన్నత విద్యను మరింత చేరువ చేసేలా ప్రభుత్వం నెలకు ఐదు తరగతులు అంటే ప్రతి ఆదివారంతోపాటు రెండో శనివారం నిర్వహిస్తుంది.
జత చేయాల్సిన సర్టిఫికెట్లు
దరఖాస్తు ఇలా..
2026–2027 విద్యా సంవత్సరంలో ప్రవేశాలకు ప్రస్తుతం ఆన్‌లైన్‌లో దరఖాస్తు నమోదు ప్రక్రియ మొదలైంది. ఫీజు ఏడాదికి రూ.3,400 ఆన్‌లైన్‌లో చెల్లించాలి. పరీక్ష ఫీజు ప్రతీ సబ్జెక్టు పేపరుకు అదనంగా చెల్లించాలి. దరఖాస్తుకు జత చేసి పత్రాలను అధ్యయన సెంటర్‌లో ఇవ్వాలి. బుక్స్ కోసం రూ.500 చెల్లిస్తే పోస్టు ద్వారా ఇంటికి వస్తాయి.


