జపాన్‌లో తెలంగాణ యువతకు ఉపాధి | - | Sakshi
Sakshi News home page

జపాన్‌లో తెలంగాణ యువతకు ఉపాధి

Aug 1 2026 12:10 AM | Updated on Aug 1 2026 12:10 AM

● మండెపల్లి ఐటీడీఆర్‌ను సందర్శించిన జపాన్‌ ‘హనా విస్టా’ ప్రతినిధులు

● మండెపల్లి ఐటీడీఆర్‌ను సందర్శించిన జపాన్‌ ‘హనా విస్టా’ ప్రతినిధులు

తంగళ్లపల్లి(సిరిసిల్ల): నైపుణ్యంగల భారతీయ ప్రొఫెషనల్‌ డ్రైవర్లకు జపాన్‌లో మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా కీలక అడుగుపడింది. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం బద్దెనపల్లిలోని ఐడీటీఆర్‌ డ్రైవింగ్‌ ట్రైనింగ్‌ ఇన్‌స్టిట్యూట్‌ను జపాన్‌కు చెందిన ‘హనా విస్టా కన్సల్టింగ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌’ ప్రతినిధులు శుక్రవారం సందర్శించారు. ఇనిస్టిట్యూట్‌లోని డ్రైవింగ్‌ శిక్షణ విధానాలు, మౌలిక సదుపాయాలు, ఆధునిక శిక్షణ పరికరాలు, నిర్వహణ ప్రమాణాలు, శిక్షణ వాతావరణాన్ని ప్రతినిధులు ప్రత్యక్షంగా పరిశీలించారు.

దీర్ఘకాలిక భాగస్వామ్యానికి ఆసక్తి

ఈ సందర్భంగా ‘హనా విస్టా కన్సల్టింగ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌’ ప్రతినిధులు మాట్లాడుతూ.. భారతీయ డ్రైవర్లను అంతర్జాతీయస్థాయి ప్రమాణాలకు అనుగుణంగా తీర్చిదిద్ది, జపాన్‌లో ఉపాధి అవకాశాలు కల్పించడమే తమ లక్ష్యమన్నారు. ఇందుకోసం మండెపల్లి ఐడీటీఆర్‌తో దీర్ఘకాలిక భాగస్వామ్యం ఏర్పరచుకోవడానికి ఉత్సుకత వ్యక్తం చేశారు. జిల్లా రవాణాశాఖ అధికారి దేవునూరి శ్రీనివాస్‌, మోటారు వాహనాల తనిఖీ అధికారి వంశీధర్‌, ఐడీటీఆర్‌ ప్రిన్సిపాల్‌ దురయ్‌ మురుగన్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement