బావుసాయిపేట ఇసుక తవ్వకాలకు సమీపంలో మూలవాగులో ఉన్న వ్యవసాయ బావిని పూడ్చివేశారు. ఇదేంటని ప్రశ్నిస్తే మా భూమి నుంచే మరింత ఇసు
కను తీస్తామని బెదిరిస్తున్నారు. ఇప్పటికే భూగర్భ జలాలు అడుగంటి పోయాయి.
– కర్నాల శ్రీకాంత్, బావుసాయిపేట
ఇసుకరీచ్ రద్దు చేయాలి
బావుసాయిపేటలో ఏర్పాటు చేసిన ఇసుక రీచ్‌తో పొలాలు దెబ్బతింటున్నాయి. మూడేళ్ల క్రితం వచ్చిన వరదతో పంటలు మునిగిపోయాయి. ఇప్పుడు కూడా అలాగే తవ్వడంతో భారీ వర్షాలు వస్తే ఈ ప్రాంతంలోని పంట పొలాలు కొట్టుకుపోయే ప్రమాదం ఉంది.
– దువ్వల రాములు, బావుసాయిపేట
మా పరిధిలోకి రాదు
బావుసాయిపేటలోని ఇసుక క్వారీ మా పరిధిలోకి రాదు. క్వారీకి టీజీఎండీసీ అనుమతులు తీసుకున్నారు. అనుమతులున్న చోటనే తవ్వకాలు చేపట్టాలి. రెవెన్యూ అధికారులను ఫీల్డ్ వద్దకు పంపించి విచారణ చేపడతాం. మరో చోట ఇసుకను తవ్వితే చర్యలు తీసుకుంటాం.
– వరలక్ష్మి, తహసీల్దార్, కోనరావుపేట


