● జిల్లా వైద్యాధికారి ఏంజెలా ఆల్ఫ్రెడ్ ● సిరిసిల్లలో అర్బన్ హెల్త్ సెంటర్ తనిఖీ
సిరిసిల్ల: అత్యవసర మందులను ఆరోగ్య కేంద్రాల్లో అందుబాటులో ఉంచి, మెరుగైన వైద్యసేవలు అందించాలని జిల్లా వైద్యాధికారి జి.ఏంజెలా ఆల్ఫ్రెడ్ కోరారు. జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్‌నగర్ పట్టణ ఆరోగ్య కేంద్రాన్ని గురువారం తనిఖీ చేశారు. వైద్యసేవలు, రోగుల నమోదు, ఔషధాల నిల్వలు, ప్రయోగశాల సేవలు, గర్భిణీలకు అందిస్తున్న సేవలు, టీకాల కార్యక్రమం, పారిశుధ్యం నిర్వహణను పరిశీలించారు. రోగుల పట్ల మర్యాదగా వ్యవహరించాలని సూచించారు. నిజమైన పేదలే ప్రభుత్వ ఆస్పత్రులకు వస్తారని, నాణ్యమైన వైద్యసేవలు అందించాలన్నారు. అధిక రక్తపోటు, మధుమేహం వంటి అసంక్రమిత వ్యాధుల స్క్రీనింగ్ వేగంగా చేయాలన్నారు. డాక్టర్ గీతాంజలి ఉన్నారు.


