నీరజ్‌ చోప్రాయే రోల్‌ మోడల్‌ | - | Sakshi
Sakshi News home page

నీరజ్‌ చోప్రాయే రోల్‌ మోడల్‌

Aug 7 2026 3:53 AM | Updated on Aug 7 2026 3:53 AM

నీరజ్‌ చోప్రాయే రోల్‌ మోడల్‌ మెడల్‌ తేవడమే లక్ష్యం మేమేం తక్కువ కాదు

ఒలింపిక్స్‌లో నీరజ్‌ చోప్రా మెడల్‌ గెలిచిన వీడియోను యూట్యూబ్‌లో చాలా సార్లు చూశాను. ఆయన స్ఫూర్తితోనే నేను ఈ ఆటను కెరీర్‌గా ఎంచుకున్నాను. సౌత్‌జోన్‌లో 6వ స్థానం, రాష్ట్ర పోటిల్లో బంగారు పతకాలను సాధించాను. భవిష్యత్‌లో జాతీయ పోటిల్లో పతకం సాధించడమే లక్ష్యం.

– కె స్వామి

నేను రెండేళ్లుగా జావెలిన్‌ ప్రాక్టీస్‌ చేస్తున్నాను. ప్రస్తుతం లోకల్‌ గ్రౌండ్‌లోనే సీనియర్ల సలహాలతో నేర్చుకుంటున్నాను. రాష్ట్రస్థాయి పోటీల్లో పతకం సాధించాను. త్వరలోనే జాతీయస్థాయి పోటీల్లో జిల్లా పేరు నిలబెడతా. ఇప్పటి వరకు మూడు రజత పతకాలను సాధించాను.

– సురేష్‌నాయక్‌

సాధారణంగా అమ్మాయిలు జావెలిన్‌ వైపు రారు అనుకుంటారు. కానీ ఈ ఆటలో పవర్‌ మాత్రమే కాదు, ఫ్లెక్సిబిలిటీ కూడా ముఖ్యం. నీరజ్‌ చోప్రా విజయాలు నాలాంటి ఎంతోమంది అమ్మాయిలకు స్ఫూర్తినిచ్చాయి. అంతర్జాతీయ స్థాయిలో రాణించగల నమ్మకం నాకుంది. ఇప్పటి వరకు రాష్ట్రస్థాయిలో ఒక రజతం, ఒక కాంస్యం సాధించాను.

– వి సహస్ర

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement