జగిత్యాలక్రైం: జిల్లాకేంద్రంలోని యావర్‌రోడ్‌లో.. అటవీశాఖ కార్యాలయం సమీపంలో కృష్ణానగర్ వైపు వెళ్తున్న ప్రైవేటు పాఠశాల వాహనాన్ని ఆర్టీసీ అద్దె బస్సు మంగళవారం ఉదయం ఢీకొంది. కృష్ణానగర్‌కు చెందిన ఓ ప్రైవేటు వాహనం 20 మంది విద్యార్థులతో కొత్తబస్టాండ్ నుంచి కృష్ణానగర్ వైపు వెళ్తోంది. అదే సమయంలో పాతబస్టాండ్ నుంచి కొత్తబస్టాండ్ వైపు వెళ్తున్న ఆర్టీసీ అద్దె బస్సు అతివేగంగా వెళ్లి ఢీకొంది. ఈ ఘటనలో వాహనంలో ఉన్న ఇద్దరు విద్యార్థులకు గాయాలయ్యాయి. నిత్యం రద్దీగా ఉండే యావర్‌లో సంఘటన జరగడంతో కొద్దిసేపు వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. అక్కడ ఉన్న వారంతా చిన్నారులను చేరదీశారు. ప్రైవేట్ వాహన డ్రైవర్, జగిత్యాల అర్బన్ మండలం తిప్పన్నపేటకు చెందిన చక్రాల సుదర్శన్ ఫిర్యాదు మేరకు బస్సు డ్రైవర్ మారంపల్లి నరేశ్‌పై కేసు నమోదు చేసినట్లు పట్టణ ఎస్సై సుప్రియ తెలిపారు.
ఇద్దరు విద్యార్థులకు గాయాలు


