ఇటీవల ప్రజావాణిలో ఫిర్యాదు చేసిన అనుమతులు, లేఖలపై విచారణ చేపడుతున్నాం. ఇప్పటికే ఓమారు నోటీసులు జారీచేశాం. ఆ సమయం దాటడంతోనే అనుమతులు లేకుండా నిర్మాణాలు చేపడితే చర్యలు తీసుకుంటాం. మున్సిపల్ నిబంధనల మేరకే ఇంటి నిర్మాణాలు కొనసాగాలి. అక్రమ నిర్మాణాలు, ఆక్రమణలు జరిగితే ఉపేక్షించేది లేదు. కూల్చివేతలు చేపట్టాలంటే తప్పకుండా ఐదు శాఖల సమన్వయంతో చేయాల్సి ఉంటుంది. కట్టకింద బస్టాండు స్థలంపై హద్దులు నిర్ణయించాలని ఆర్డీవోకు లేఖ రాశాం.
– లోకేశ్, వేములవాడ మున్సిపల్ కమిషనర్


