● ఎస్పీ మహేశ్ బీ గీతే
సిరిసిల్ల: సమర్థవంతమైన దర్యాప్తు, పటిష్టమైన సాక్ష్యాధారాల సేకరణ, వేగవంతమైన విచారణతో నిందితులకు శిక్షలు పడేలా జిల్లా పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. జిల్లాలో ఆరు నెలల్లో 44 కేసుల్లో 66 మందికి జైలుశిక్ష విధించాయి. నిందితులకు శిక్ష పడేలా కృషిచేస్తున్న పోలీస్ సిబ్బందిని ఎస్పీ ప్రశంసాపత్రాలు అందించారు. ఎస్పీ మాట్లాడుతూ జిల్లాలో జరిగిన ఐదు హత్య కేసుల్లో 19 మందికి యావజ్జీవం పడిందని తెలిపారు. మరో మూడు కేసుల్లో 20 ఏళ్ల జైలు, మరో కేసులో నిందితులకు పదేళ్లు, ఇంకో ఏడు కేసుల్లో 3 నుంచి 5 ఏళ్ల జైలు శిక్షలు పడ్డాయని వివరించారు. ఇలా జిల్లాలో మరో 17 కేసుల్లో నిందితులకు మూడేళ్ల వరకు జైలుశిక్ష, పది కేసుల్లో ఏడాది జైలు శిక్ష పడినట్లు ఎస్పీ వెల్లగించారు. అదనపు ఎస్పీ చంద్రయ్య, కోర్టు మానిటరింగ్ ఎస్సైలు రవీంద్రనాయుడు, శ్రావణ్‌యాదవ్, కోర్టు కానిస్టేబుళ్లు, కోర్టు మానిటరింగ్ కానిస్టేబుళ్లు పాల్గొన్నారు.


