కరీంనగర్‌స్పోర్ట్స్: హన్మకొండలోని జేఎన్ స్టేడియంలో శుక్రవారం తెలంగాణ రాష్ట్ర 12వ యూత్ అండర్ 18 అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ పోటీలు నిర్వహించారు. 12 సంవత్సరాల కేటగిరీలో 60 మీటర్ల పరుగు విభాగంలో 48 మంది క్రీడాకారులు పాల్గొనగా, నూరైన్ ప్రతి భ కనబరిచి స్వర్ణ పతకం సాధించింది. ఈ సందర్భంగా జిల్లా అథ్లెటిక్స్ సంఘం బాధ్యులు నూరైన్‌ను అభినందించి భవిష్యత్‌లో మరి న్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.
ఇద్దిరికి జైలు శిక్ష
కరీంనగర్‌క్రైౖం: ఒకరి మృతికి కారణమైన ఇద్దరికి పదేళ్ల జైలు, రూ.వెయ్యి చొప్పున జరిమానా విధిస్తూ జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎస్.శివకుమార్ శుక్రవారం తీర్పునిచ్చారు. ప్రాసిక్యూషన్ కథనం ప్రకారం కరీంనగర్ హౌసింగ్‌బోర్డ్ కాలనీలో గులాం షబ్బీర్ హుస్సేన్ తన కుటుంబంతో అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నాడు. వీరి పక్కనే రియాజ్ బేగం కుటుంబం ఉంటోంది. వీరు పరిసరాలు అపరిశుభ్రంగా ఉంచుకుంటున్నారని షబ్బీర్ ఇంటి ఓనర్‌కు ఫిర్యాదు చేశాడు. ఇంటి ఓనర్ రియాజ్‌బేగంను ఇల్లు ఖాళీ చేయాలని ఒత్తిడి చేశాడు. 2023 నవంబర్ 30న రియాజ్ బేగం కుటుంబ సభ్యులు షబ్బీర్ కుటుంబంతో గొడవపడ్డారు. ఆ సమయంలో పాలు తీసుకుని వచ్చిన షబ్బీర్ మామ మహమ్మద్ ఉస్మాన్(64)పై కర్రతో దాడి చేయడంతో గాయపడ్డాడు. ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ చనిపోయాడు. కరీంనగర్ త్రీటౌన్ పోలీసులు ఘటనకు బాధ్యులైన షేక్ మజీద్, రియాజ్ బేగం, షేక్ ఇర్ఫాన్ ఖాన్, మున్నీ బేగం, మహమ్మద్ ముబీన్‌పై కేసు నమోదు చేశారు. సీఐ వి.శ్రీనివాస్ దర్యాప్తు జరిపారు. సాక్ష్యులను సీడీవో సుధాకర్ కోర్టులో ప్రవేశపెట్టగా పీపీ ప్రతాప్ విచారించారు. సాక్ష్యాధారాలు పరిశీలించిన జడ్జి శివకుమార్ షేక్ ముజీద్, షేక్ ఇర్ఫాన్ ఖాన్‌పై నేరం నిరూపణ కావడంతో జైలుశిక్ష, జరిమానా విధించారు. మిగితా వారిపై కేసు కొట్టి వేశారు.


