శిథిలావస్థలో ఉన్న భవనాలు గుర్తించాలి
లో లెవెల్ కల్వర్టులు, రహదారులను పర్యవేక్షించాలి
కలెక్టర్ గరీమా అగ్రవాల్
సిరిసిల్ల: జిల్లాలో కురుస్తున్న వర్షాల నేపథ్యంలో క్షేత్రస్థాయిలో ఇబ్బందులు రాకుండా అధికారులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ గరీమా అగ్రవాల్ ఆదేశించారు. కలెక్టరేట్‌లో గురువారం అధికారులతో సమీక్షించారు. శిథిలావస్థలో ఉన్న ఇండ్లు, భవనాలు, రహదారులు, లో లెవల్ కల్వర్టులను పర్యవేక్షించాలని సూచించారు. ఆస్తి, ప్రాణ, పంటనష్టం సంభవిస్తే జిల్లా అధికారులకు సమాచారం ఇవ్వాలని తెలిపారు. చెరువులు, కుంటలు, వంతెనలు, జలాశయాలను నిరంతరం పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించారు. దోమలు వృద్ధి చెందకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు. గుడిసెల్లో నివసిస్తున్న కుటుంబాలకు అర్హతల అధారంగా ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలని ఆదేశించారు.
కంట్రోల్ రూమ్ ఏర్పాటు
వర్షాల నేపథ్యంలో కలెక్టరేట్‌లో కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ తెలిపారు. ఏమైనా ఇబ్బందులు ఉంటే 93986 84240లో సమాచారం ఇవ్వాలని కోరారు. అదనపు కలెక్టర్ గడ్డం నగేశ్, ప్రొబేషనరీ డిప్యూటీ కలెక్టర్ నిఖిత, జెడ్పీ సీఈవో వెంకట మాధవరావు, సీపీఓ శ్రీనివాసాచారి, డీఆర్డీఓ లక్ష్మీనారాయణ, డీపీవో జయశీల, ఎన్పీడీసీఎల్ ఎస్‌ఈ వేణుమాధవ్, పంచాయితీరాజ్ ఈఈ సుదర్శన్, మున్సిపల్ కమిషనర్లు ఖదీర్‌పాషా, లోకేశ్ పాల్గొన్నారు.


